మహాత్మా గాంధీ 151వ జయంతిని పురస్కరించుకుని నేపాల్ అధ్యక్షురాలు బిద్యా దేవి భండారి ఖాంట్మాండులోని రాష్ట్రపతి భవనంలో జాతిపితపై రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. గాంధీ జీవితంలో ఆదర్శంగా నిలిచే ఘట్టాలు, యువతను ప్రభావితం చేసే అంశాలను ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు భారత రాయబారి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ పుస్తకాన్ని భారత విదేశాంగ కార్యాలయం, బీపీ కోయిరాల ఇండియా-నేపాల్ ఫౌండేషన్ సంయుక్తంగా ప్రచురించాయి. మహాత్ముని బోధనలను నేపాలీ మిత్రులు ఆదరించి.. అనుసరిస్తారని ఫౌండేషన్ సభ్యులు ఆకాంక్షించారు.