ETV Bharat / international

ఓలీ విముఖత- మళ్లీ మొదటికి నేపాల్ సంక్షోభం! - నేపాల్​ అధ్యక్షురాలు

​ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాల్సిందిగా తమ దేశ రాజకీయ పార్టీలకు నేపాల్ అధ్యక్షురాలు బిద్యా దేవి భండారి పిలుపునిచ్చారు. ప్రధానిగా ఇటీవల మళ్లీ బాధ్యతలు చేపట్టిన కేపీ శర్మ ఓలీ.. పార్లమెంటులో బలనిరూపణకు విముఖత చూపినట్లు తెలుస్తోంది.

Nepal President
నేపాల్ అధ్యక్షురాలు, విద్యా దేవీ భండారి
author img

By

Published : May 21, 2021, 7:37 AM IST

నేపాల్​లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాల్సిందిగా తమ దేశ రాజకీయ పార్టీలకు అధ్యక్షురాలు బిద్యా దేవి భండారి గురువారం పిలుపునిచ్చారు. ఇందుకు శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు గడువునిచ్చారు. ప్రధానమంత్రిగా కేపీ శర్మ ఓలీ ఇటీవల మళ్లీ ప్రమాణం చేసినప్పటికీ.. ప్రతినిధుల సభలో బల నిరూపణకు విముఖత చూపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇతర రాజకీయ పార్టీలు చొరవ తీసుకోవాలని అధ్యక్షురాలు కోరారు.

నేపాల్​ కమ్యూనిస్టు పార్టీ(యూనిఫైడ్​ మార్కిస్ట్​-లెనినిస్ట్​) ఛైర్మన్​ అయిన ఓలీ.. పార్లమెంటులో బలం నిరూపించలేకపోవడం వల్ల రాజీనామా చేశారు. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో మిగిలిన పార్టీలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 14న ఓలీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేప్టటారు. నెల రోజుల్లోగా పార్లమెంటులో బలాన్ని నిరూపించుకోవాల్సి ఉన్నప్పటికీ.. ప్రధాని సిఫార్సు మేరకు ప్రభుత్వ ఏర్పాటుకు రావాల్సిందిగా ఇతర పార్టీలను అధ్యక్షురాలు ఆహ్వానించారు.

ఇదీ చూడండి: ఓలీ సర్కారుకు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.