నేపాల్ ప్రధానమంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన షేర్ బహదూర్ దేవ్బా.. ఆ దేశ పార్లమెంట్లో నిర్వహంచిన బలపరీక్షలో లాంఛనంగా నెగ్గారు. 275 సభ్యులున్న నేపాల్ పార్లమెంట్ ప్రతినిధుల సభలో.. దేవ్బాకు 136 ఓట్లు అవసరం కాగా.. 165మంది ఆయనకు అనుకూలంగా ఓటువేశారు.
ప్రతినిధుల సభలో ఆదివారం విశ్వాస పరీక్ష జరిగింది. ఓటింగ్లో 249 మంది పాల్గొన్నారు. ఇందులో భాగంగా 165మంది దేవ్బాకు అనుకూలంగా ఓటు వేయగా.. 83 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ఓ వ్యక్తి తటస్థంగా ఉండిపోయారు.
నేపాల్ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు దేవ్బా.. జులై 13న ప్రధానిగా ప్రమాణాస్వీకారం చేశారు.
దేవ్బాకు మోదీ శుభాకాంక్షలు
దేవ్బాకు శుభాకాంక్షలు తెలిపారు భారత్ ప్రధాని నరేంద్ర మోదీ. "అన్ని రంగాల్లో ప్రత్యేక భాగస్వామ్యాన్ని మరింత మెరుగుపరచడానికి.. ఇరు దేశా ప్రజల సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి మీతో(దేవ్బా) కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను" అని ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి: నేపాల్ పార్లమెంటు పునరుద్ధరణ- ప్రధానిగా షేర్ బహదూర్!