ETV Bharat / international

భారత్​తో 'మ్యాప్​ వార్'​ కోసం నేపాల్ రాజ్యాంగ సవరణ!

భారత్​తో సరిహద్దు వివాదానికి కాలుదువ్వుతున్న నేపాల్ మరో దుందుడుకు చర్యకు పాల్పడింది. వ్యూహాత్మకంగా కీలకమైన​ లిపులేఖ్​, కాలాపానీ, లింపియాధుర ప్రాంతాలను తమ దేశ రాజకీయ పరిపాలనా పటంలో చేర్చుతూ... రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్​లో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు ప్రధాన ప్రతిపక్షం నేపాలీ కాంగ్రెస్ కూడా మద్దతుగా నిలవడం గమనార్హం.

Nepal govt tables Constitution amendment bill in parliament amidst border row with India
భారత్ నేపాల్​ మధ్య రాజుకుంటున్న సరిహద్దు వివాదం
author img

By

Published : May 31, 2020, 3:40 PM IST

నేపాల్​ ప్రభుత్వం తమ దేశ పటాన్ని మార్చాలనే లక్ష్యంతో ఆదివారం రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్​లో ప్రవేశపెట్టింది. భారత్​తో సరిహద్దు వివాదాన్ని కావాలని రాజేస్తున్న నేపాల్​ తాజాగా ఈ దుందుడుకు చర్యకు దిగింది.

నేపాల్ ప్రభుత్వం తరఫున న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శివమయ తుంబహాంగ్​ఫే ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ప్రధాన ప్రతిపక్షం నేపాలీ కాంగ్రెస్ కూడా దీనికి మద్దతు ఇస్తున్నట్లు ఇంతకు ముందే ప్రకటించింది. ఈ బిల్లు ఆమోదం పొందితే... నేపాల్ చేసిన రెండో రాజ్యాంగ సవరణ అవుతుంది.

వ్యూహాత్మకంగా కీలకమైన​ లిపులేఖ్​, కాలాపానీ, లింపియాధుర ప్రాంతాలను తమ దేశ రాజకీయ పరిపాలనా పటంలో చేర్చింది నేపాల్. ఈ కొత్త పటాన్ని ఆ దేశ క్యాబినెట్​ కూడా ఆమోదించింది.

కృత్రిమ మార్పులు అంగీకరించేది లేదు

భారత్​-నేపాల్​ సరిహద్దులకు సంబంధించి ఎలాంటి కృత్రిమ మార్పులను అంగీకరించేది లేదని భారత్​ స్పష్టం తేల్చిచెప్పింది. నేపాల్ రూపొందించిన మ్యాప్​కు ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవని గుర్తు చేసింది. సరిహద్దు సమస్యను ద్వైపాక్షిక చర్యలు ద్వారా పరిష్కరించుకోవాలనే భావనకు విరుద్ధంగా నేపాల్ చర్యలున్నాయని మండిపడింది భారత్.

ఇదీ చూడండి: చైనా దుర్నీతి: చర్చలు జరుపుతూనే సైన్యం మోహరింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.