నేపాల్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ .. రెండుగా చీలిన నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీలో వర్గాలకు చట్టబద్ధత కల్పించేందుకు నేపాల్ ఎన్నికల సంఘం నిరాకరించింది. ఇరు వర్గాలు పొలిటికల్ పార్టీస్ యాక్ట్-2017కు అనుగుణంగా వ్యవహరించలేదని అందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. పార్టీ గుర్తు 'ది సన్' తమదంటే తమదంటూ ఇరు వర్గాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి.
"పార్టీ సిద్ధాంతాల ప్రకారం ఇరు వర్గాలు నిర్ణయాలు తీసుకోవటంలో విఫలమయ్యాయి. అందువల్ల పార్టీ వివరాలను మేము పొందుపరచలేము. మేము ఇదే విషయాన్ని ఇరు వర్గాల నేతలు కేపీ శర్మ ఓలి, పుష్ప కమల్ దహల్లకు వివరించాం."
-రాజ్‌కుమార్ శ్రేష్ఠ , నేపాల్ ఎన్నికల సంఘం ప్రతినిధి
ప్రధాని కేపీ శర్మ ఓలి లోక్‌సభను రద్దు చేసిన తర్వాత.. డిసెంబర్ 22న నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ రెండుగా చీలింది. ఎన్నికల సంఘం నిర్ణయం ప్రకారం పార్టీ రెండుగా చీలినా.. సాంకేతికపరంగా, న్యాయపరంగా ఒకే పార్టీగా ఉన్నాయని పేర్కొంది.
ఇదీ చదవండి : ఓలిని పార్టీ నుంచి తొలగించిన ఎన్సీపీ