సిరియాలో ప్రభుత్వ దళాలు, సాయుధ బలగాలు మధ్య రెండు రోజులుగా జరుగుతున్న ఘర్షణలో సుమారు 70 మంది మరణించారు. వందల మంది గాయపడ్డారు. మరణించిన వారిలో 36 మంది ప్రభుత్వ దళాల సభ్యులు ఉన్నారు.
సిరియాలోని మానవ హక్కుల పరిశీలన సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. నెలరోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఈ దాడులు బలహీనపరిచాయని తెలిపింది. ఇరు వర్గాల మధ్య జరుగుతున్న దాడులు. అత్యంత హింసాత్మకంగా మారుతున్నాయని, మానవ హక్కుల పరిశీలన సంస్థ హెడ్ రామి అబ్దుల్ రెహ్మాన్ తెలిపారు. మారెట్ అల్-నుమాన్ ప్రాంతంపై ప్రభుత్వ దళాలు భీకర దాడులు జరపడంతో.. నగరం మొత్తం పొగ కమ్ముకుంది.
రష్యన్ యుద్ధ విమానాల మద్దతుతో సిరియా సైన్యం పట్టు కోల్పోయిన భూభాగాన్ని తిరిగి పొందటానికి ఈ దాడులు చేస్తోంది.
ఇదీ చూడడి : వరుసగా మూడోరోజు పాక్ కవ్వింపు చర్యలు