ఇటీవల జరిపిన క్షిపణి ప్రయోగాలను ఉద్దేశించి ఐరాస స్పందించిన తీరుపై ఉత్తర కొరియా మండిపడింది. ఐరాస భద్రతా మండలి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని దుయ్యబట్టింది. దీనికి తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఇతర దేశాలు జరుపుతున్న క్షిపణి పరీక్షలపై భద్రతా మండలి నోరు మెదపడం లేదని ఆక్షేపించింది.
"ఐరాస నిర్ణయం తమ సార్వభౌమాధికారానికి విఘాతం కలిగిస్తోంది. సమస్యల పట్ల భద్రతా మండలి ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. శత్రువుల పట్ల అమెరికా పాటించే విధానాన్ని ఇది సూచిస్తోంది. ఇలాంటి ఆయుధాలనే ఇతర దేశాలు ప్రయోగిస్తే ఏం చేయకుండా.. కేవలం ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలనే తీవ్రంగా పరిగణించడంలో అర్థం లేదు. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు మరిన్ని తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయి."
-జో చోల్ సు, ఉత్తర కొరియా విదేశాంగ శాఖ అధికారి
ఇటీవల.. అమెరికా హెచ్చరికలను తోసిపుచ్చుతూ మరోసారి క్షిపణి పరీక్షలు చేపట్టింది ఉత్తర కొరియా. రెండు కొత్తతరం గైడెడ్ మిసైల్స్‌ను విజయవంతంగా ప్రయోగించినట్లు తెలిపింది.
ఈ నేపథ్యంలో ఉత్తర కొరియాపై ఆంక్షలను పునరుద్ధరించాలని ఐరాస భద్రతా మండలి నిర్ణయించింది. అమెరికా అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండలి ఏకగ్రీవంగా తీర్మానించినట్లు గత శుక్రవారం ప్రకటించింది.
ఇవీ చదవండి: