ETV Bharat / international

దక్షిణ కొరియాకు కిమ్​ సోదరి స్ట్రాంగ్ వార్నింగ్ - దక్షిణ కొరియాకు హెచ్చరికలు

దక్షిణ కొరియాకు మరోమారు గట్టి హెచ్చరికలు పంపారు ఉత్తర కొరియా అధినేత కిమ్​ జోంగ్​ ఉన్​ సోదరి కిమ్​ యో జోంగ్​. అమెరికాతో సైనిక విన్యాసాలు ఆక్రమణ ఉద్దేశంతో చేసేవిగా అభివర్ణించారు. ఈ ప్రదర్శనల ద్వారా అణ్వాయుధ చర్చల వెనక అమెరిక కపటత్వం కనిపిస్తోందన్నారు. దక్షిణ కొరియా నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ జరిగే వరకు కొరియన్​ ప్రాంతంలో శాంతి పునరుద్ధరణ జరగదని స్పష్టం చేశారు.

Kim Yo Jong
కిమ్​ యో జోంగ్​
author img

By

Published : Aug 10, 2021, 1:45 PM IST

అమెరికాతో సైనిక విన్యాసాలు నిర్వహించనున్న దక్షిణ కొరియాకు మరోమారు గట్టి హెచ్చరికలు పంపారు ఉత్తర కొరియా అధినేత కిమ్​ జోంగ్​ ఉన్​ సోదరి కిమ్​ యో జోంగ్​. ఆక్రమణ ఉద్దేశంతో చేసే రిహార్సల్స్​గా అభివర్ణించారు. తమ యుద్ధ సామర్థ్యాలను బలోపేతం చేసే చర్యలను వేగవంతం చేస్తున్నట్లు హెచ్చరించారు.

ఆగస్టు 16-26 మధ్య అమెరికా, దక్షిణ కొరియా సైనిక విన్యాసాలు చేపట్టనున్నాయి. అంతకు ముందు.. ఇరు దేశాల సైన్యాలకు నాలుగు రోజుల పాటు ప్రాథమిక శిక్షణ ఉంటుందని దక్షిణ కొరియా మీడియా వెల్లడించిన తర్వాత.. కిమ్​ యో జోంగ్​ మంగళవారం ఈమేరకు స్పందించారు. ఈ ప్రకటన విడుదల చేసేందుకు తనకు అధికారం అప్పగించారని, ఈ సందేశం నేరుగా తన సోదరుడి నుంచి వచ్చిందని స్పష్టం చేశారు కిమ్​ యో.

"గతంలో చేసిన హెచ్చరికలను పక్కన పెట్టి ఉమ్మడి ప్రదర్శనలు చేయాలని దక్షిణ కొరియా తీసుకున్న నిర్ణయం.. నమ్మకద్రోహానికి నిదర్శనం. అది మిత్రపక్షాలను తీవ్రమైన భద్రతా ముప్పులోకి నెడుతుంది. ఈ సైనిక విన్యాసాలను కొనసాగించటం.. ఉత్తర కొరియా అణ్వాయుధాలపై చర్చల పునరుద్ధరణకు జో బైడెన్ పరిపాలన విభాగం పిలుపునివ్వటం వెనుక ఉన్న కపటత్వాన్ని తెలియచెబుతోంది. దక్షిణ కొరియా నుంచి అమెరికా తన బలగాలు, ఆయుధాలను ఉపసంహరించుకునే వరకు కొరియన్​ ప్రాంతంలో శాంతి స్థాపన జరగదు. అమెరికా నుంచి ఎదురయ్యే సైనిక ముప్పును ఎదుర్కొనేందుకు కావాల్సిన సామర్థ్యాన్ని పెంచుకోవటంపై దృష్టి సారిస్తాం. మాపై ఏదైనా సైనిక చర్యకు పాల్పడితే.. దానిని వేగంగా తిప్పికొట్టేందుకు కావాల్సిన శక్తిమంతమైన ఆయుధాలను సమకూర్చుకోవటం సహా, జాతీయ రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం."

- కిమ్​ యో జోంగ్​, ఉత్తర కొరియా అధినేత సోదరి

ఈ సైనిక ప్రదర్శనలను కొరియా పట్ల అమెరికా శత్రు విధానాలకు స్పష్టమైన నిదర్శనంగా పేర్కొన్నారు కిమ్​ యో. బలవంతంగా, సైనిక చర్యలతో తమ దేశాన్ని అణచివేసే ప్రయత్నమన్నారు. తమ ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లితే అంతకంతకూ మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. అలాగే.. కొరియా ప్రాంతంలో పరిస్థితులు భయానకంగా మారుతాయన్నారు.

ఈ ఏడాది మార్చిలో రెండు స్వల్ప శ్రేణి​ క్షిపణులను పరీక్షించటం ద్వారా బాలిస్టిక్​ మిసైల్స్​ పరీక్షలకు ఏడాది పాటు ఇచ్చిన విరామానికి తెరదించింది ఉత్తర కొరియా. అమెరికా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అణ్వాయుధ పరీక్షల సంప్రదాయాన్ని కొనసాగించింది. అయితే.. కరోనా మహమ్మారి విజృంభణతో వైరస్​ కట్టడిపై చర్యలు, దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే క్రమంలో క్షిపణుల ప్రయోగాలను నిలిపివేసినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: కిమ్ రాజ్యంలో ఆకలి కేకలు- సైన్యం సరకులు కూడా...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.