ETV Bharat / international

అమెరికా- ఆస్ట్రేలియా డీల్​పై ఉత్తర కొరియా ఆగ్రహం! - ఆకస్​ కూటమి

అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్​ల కొత్త కూటమిని(AUKUS Alliance) అత్యంత ప్రమాదకర చర్యగా పేర్కొంది ఉత్తర కొరియా(north korea criticizes US). ఆస్ట్రేలియాకు అణ్వాయుధ సామర్థ్యం గల జలాంతర్గాములను అందించేందుకు అమెరికా కుదుర్చుకుంటోన్న ఒప్పందాన్ని తప్పుపట్టింది. అది తమ దేశ భద్రతపై ప్రభావం చూపుతుందని, అదే జరిగితే అందుకు తగిన విధంగా చర్యలు చేపడతామని హెచ్చరించింది.

N Korea slams US
అమెరికా, ఆస్ట్రేలియా, ఉత్తర కొరియా
author img

By

Published : Sep 20, 2021, 12:10 PM IST

ఆస్ట్రేలియాకు అణ్వాయుధ సామర్థ్యం కలిగిన జలాంతర్గాములను(U.S. nuclear submarines) అందించాలని అమెరికా నిర్ణయించటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఉత్తర కొరియా(north korea criticizes US). ఇరు దేశాల మధ్య జలాంతర్గాముల(nuclear powered submarines) కొనుగోలుకు ఒప్పందం కుదిరితే అది తమ దేశ భద్రతను ప్రభావితం చేస్తుందని, అదే జరిగితే.. తగిన విధంగా ప్రతిస్పందన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

ఈ అంశంపై ఉత్తర కొరియా విదేశాంగ శాఖ అధికారి ఒకరు ఆ దేశ అధికార మీడియాతో మాట్లాడారు. అమెరికా, బ్రిటన్​, ఆస్ట్రేలియాలు ప్రత్యేక కూటమిగా((AUKUS Alliance)) ఏర్పడటాన్ని అత్యంత ప్రమాదక చర్యగా అభివర్ణించారు.

"అమెరికా, ఆస్ట్రేలియా మధ్య ఒప్పందాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం. మా దేశ భద్రతపై చిన్న ప్రతికూల ప్రభావం చూపినా.. అందుకు తగిన విధంగా స్పందిస్తాం. ఈ ఒప్పందం ప్రాంతీయ శాంతి భద్రతలను నాశనం చేస్తుంది. అంతర్జాతీయంగా సమస్యలు తలెత్తి.. సాయుధ దాడులకు దారి తీస్తుంది. ప్రస్తుత పరిస్థితులు.. దీర్ఘకాల లక్ష్యంతో దేశ రక్షణ సామర్థ్యాలను పెంపొందించే మా ప్రయత్నాలను ఏ మాత్రం తగ్గించుకోకూడదని స్పష్టం చేస్తున్నాయి. "

- ఉత్తర కొరియా విదేశాంగ శాఖ

అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్​లతో కొత్త కూటమిపై(AUKUS Alliance) గత వారం ప్రకటన చేశారు అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్​. ఆస్ట్రేలియాకు 8 అణ్వాయుధ సామర్థ్యం కలిగిన జలాంతర్గాములను అందిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఫ్రాన్స్​. తమ దేశానికి చెందిన నావల్​ గ్రూప్​ నుంచి 12 జలాంతర్గాముల కొనుగోలు నుంచి తప్పుకునేందుకే ఆస్ట్రేలియా ప్రయత్నాలు చేపట్టిందిని ఆరోపించింది. ఫ్రాన్స్​ ఆరోపణలను మీడియా సమావేశంలో ప్రస్తావించింది కొరియా. అమెరికా నిర్ణయం.. ప్రాంతీయ శాంతి భద్రతలను నాశనం చేస్తుందన్న చైనా, ఇతర దేశాల వ్యాఖ్యలకు మద్దతు పలికింది.

ఇదీ చూడండి: Indo Pacific: చైనాకు దీటుగా.. ఆ మూడు దేశాల కొత్త కూటమి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.