పాకిస్థాన్ ప్రథమ మహిళ, ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్ భార్య బుష్రా బీబీకి అతీంద్రియ శక్తులు ఉన్నాయా...? ఆమె ప్రతిబింబం అద్దంలో కనిపించదా...? ఈ ప్రశ్నకు ఔననే జవాబిస్తోంది పాకిస్థాన్ మీడియా. పాక్ ప్రధాని నివాసంలో పనిచేస్తున్న సిబ్బంది ఈ విషయాన్ని ధ్రువీకరించారంటూ పెద్ద కథనాన్నే ప్రసారం చేసింది ఓ టీవీ ఛానల్. ఇందుకు సాక్ష్యం ఇదేనంటూ ఓ ఫొటోనూ చూపించింది.
బుష్రా బీబీకి ప్రత్యేక శక్తులు ఉన్నాయన్న అంశంపై ట్విట్టర్లో పెద్ద చర్చే నడుస్తోంది. కొందరు పాత్రికేయులు... బుష్రా బీబీకి సంబంధించిన ఫొటోలు కల్పితమని అంటున్నారు.
వాటూ వంశస్థురాలైన 41 ఏళ్ల బుష్రా రియాజ్ వట్టూ.. పాక్‌లో పవిత్ర పుణ్యక్షేత్రమైన పాక్‌పట్టన్‌కు చెందినవారు. అక్కడే ఆధ్యాత్మిక శక్తులు సొంతం చేసుకోవడంలో శిక్షణ తీసుకున్నారు. లాహోర్ నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రదేశం ఉంటుంది.
ఎన్నికలకు ముందే వివాహం
ఆధ్యాత్మిక శక్తులున్న బీబీని.. ప్రధాని ఎన్నికలకు కేవలం ఆరునెలల ముందు మూడో భార్యగా వివాహమాడారు ఇమ్రాన్. మొదట్లో.. ఆయన ప్రధాని కావాలంటే వాటూ వంశానికి చెందిన తన కుమార్తెనో లేక చెల్లినో పెళ్లి చేసుకోవాలని ఇమ్రాన్‌కు సూచించారు బీబీ. ఆ తర్వాత కచ్చితంగా పెళ్లి అయిన మహిళను, ఐదుగురు పిల్లల తల్లిని వివాహం చేసుకోవాలని ఆమెకు కల వచ్చినట్లు ఆయనకు చెప్పారు. ఫలితంగా బుష్రానే మనువాడారు ఇమ్రాన్.
బుర్ఖా ధరించిన మొదటి మహిళ!
పాక్ ప్రధాన మంత్రి భార్యగా అధికారిక కార్యక్రమాల్లోనూ బుర్ఖా ధరించిన మొదటి మహిళగా నిలిచారు బీబీ. ఐరాస 74వ సర్వసభ్య సమావేశాలకు న్యూయార్క్‌కు వెళ్లే ముందు భార్య బుష్రా బీబీతో కలిసి ఉమ్రా(నమాజ్)లో పాల్గొన్నారు ఇమ్రాన్. అప్పుడు బుష్రా ముఖం కనిపించకుండా.. బుర్ఖా ధరించినట్లు పాక్ మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
అయితే బుర్ఖా... తన ఆధునికతను నిర్వచించదని, ముఖాన్ని బట్టి కాకుండా వ్యక్తిత్వాన్ని బట్టి తనను అర్థం చేసుకోవాలని గతంలో పాక్ మీడియాకు ఇచ్చిన ముఖాముఖిలో స్పష్టం చేశారు బుష్రా.
ఇదీ చూడండి:- శిథిల నగరానికి పూర్వ వైభవం ఎప్పటికో....!