ETV Bharat / international

పాక్​లో రికార్డు కేసులు, మరణాలు.. న్యూయార్క్​లో తగ్గుముఖం - కరోనా మృతులు

ప్రపంచ దేశాల పాలిట కరోనా మహమ్మారి పెనుభూతంలా పరిణమిస్తోంది. రష్యాలో మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. తాజాగా 24 గంటల్లో 8,855 మందికి వైరస్​ పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. అలాగే పాకిస్థాన్​లో 4 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.

Most of 51 new SKorea cases linked to door sales
పాక్​లో రికార్డు కేసులు, మరణాలు.. న్యూయార్క్​లో తగ్గుముఖం
author img

By

Published : Jun 6, 2020, 4:45 PM IST

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది. ఇప్పటి వరకు 68 లక్షల 66 వేల మందికి పైగా వైరస్​ బారిన పడ్డారు. మరణించిన వారి సంఖ్య 4 లక్షలకు చేరువైంది. మొత్తం 33 లక్షల 62 వేల మంది ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు.

రష్యాలో ఇవాళ 8,855 కేసులు...

రష్యాలో గడిచిన 24 గంటల్లో 8,855 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 4,58,689కి ఎగబాకింది. మరో 197 మంది వైరకు బలయ్యారు. ఫలితంగా దేశ వ్యాప్తంగా 5,725 మంది మరణించారు. ఇప్పటి వరకు 2,21,388 మంది కోలుకున్నారు.

24 గంటల్లోనే 4,734 కేసులు

పాకిస్థాన్​లో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. గడిచిన 24 గంటల్లో 4,734 మందికి వైరస్ సోకినట్లు ఆ దేశ ఆరోగ్య వర్గాలు తెలిపాయి. మరో 97 మంది మృతి చెందారు. ఫలితంగా దేశ వ్యాప్తంగా 1,935 మంది వైరస్​కు బలయ్యారు. ఇప్పటి వరకు బాధితుల సంఖ్య 94 వేలకు చేరువైంది.

దక్షిణ కొరియాలో 51 కేసులు..

కరోనా మహమ్మారిపై విజయం సాధించిన దక్షిణ కొరియాలో మళ్లీ కేసులు నమోదవటం ఆందోళనను కలిగిస్తోంది. 24 గంటల్లో 51 కేసులు నమోదైనట్లు ఆ దేశ యంత్రాంగం ప్రకటించింది.

చైనాలో మరో 5 కేసులు

చైనాలో మరో ఐదుగురు వైరస్​ బారిన పడినట్లు ఆ దేశ ఆరోగ్య వర్గాలు తెలిపాయి. ఇద్దరికి లక్షణాలు లేకుండా కరోనా సోకిందని, మరో ముగ్గురు విదేశీయులని స్పష్టం చేశారు అధికారులు. ఇప్పటివరకు చైనాలో మొత్తం బాధితుల సంఖ్య 83,030కు ఎగబాకింది. ఫలితంగా 4,634 మంది మరణించారు.

అమెరికాలో ...

అమెరికాలో కరోనా కేంద్ర బిందువుగా మారిన న్యూయార్క్​లో కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం మరో 2,728 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య ఇప్పటివరకు కనిష్ఠమని రాష్ట్ర గవర్నర్​ ఆండ్రూ క్యూమో తెలిపారు. అత్యల్పంగా 42 మందే చనిపోయినట్లు పేర్కొన్నారు.

ఫ్రాన్స్​లో ...

ఫ్లాయిడ్ మృతికి వ్యతిరేకంగా ఫ్రాన్స్​లో జరుగుతున్న​ నిరసనలపై నిషేధం విధించారు అక్కడి పోలీసులు. ఇలా నిరసనలపై నిషేధం విధించటం ఇది మూడోసారి. కరోనా విజృంభిస్తోన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయినప్పటికీ వీటిని లెక్కచేయని ఆందోళనకారులు నిరసనలను ఆపడం లేదు.

ఇదీ చూడండి:వినూత్నంగా సముద్రంలోనూ 'ఫ్లాయిడ్'​ నిరసనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.