అఫ్గాన్ యుద్ధం సమయంలో తాలిబన్లపై పోరాటానికి అమెరికా సీఐఏ(సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ)(cia afghanistan).. అఫ్గాన్ కమాండోలకు కఠిన శిక్షణ ఇచ్చింది. వీరు అమెరికాకు ఆయుధం లాంటి వారు(us afghan war). కానీ తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకున్న అనంతరం వీరిని వేటాడటం మొదలుపెట్టారు. అయితే 20వేల మంది అఫ్గాన్ కమాండోల్లో చాలా మంది అమెరికాకు తిరిగొచ్చినట్టు అధికారులు ఈటీవీ భారత్‌కు వెల్లడించారు. వీరంతా అగ్రరాజ్యానికి ఓ 'రహస్య ఆయుధం'గా ఉపయోగపడతారని తెలిపారు.
"సీఐఏ శిక్షణనిచ్చి, తీర్చిదిద్దిన అఫ్గాన్ ప్రత్యేక దళం కమాండోల్లో 90శాతం మంది ఖతార్ మీదగా అమెరికాకు చేరుకున్నారు. యుద్ధవిచ్ఛిన్న దేశమైన అఫ్గాన్ గురించి వీరికి ఎన్నో విషయాలు తెలుసు. ఎన్నో కీలక సమాచారాలు వీరి వద్ద ఉన్నాయి. వీరు తిరిగిరావడం అమెరికాకు సానుకూల అంశం. ఒకవేళ అఫ్గాన్‌పై అమెరికా మిలిటరీ ఆపరేషన్ చేపట్టాలంటే వీరి శక్తిసామర్థ్యాలు ఉపయోగపడతాయి."
--- అధికారులు.
ఎప్పుడైనా, ఎక్కడైనా మోహరించే విధంగా ఈ దళాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయి. పంజ్‌షేర్‌లో ఎన్ఆర్ఎఫ్(నేషనల్ రెసిస్టెన్స్ ఫోర్స్) తాలిబన్లతో పోరాడుతోంది. అవసరమైతే కమాండోలను అగ్రరాజ్యం అక్కడా మోహరించవచ్చు. అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ హయాంలో అఫ్గాన్ భద్రతా దళాన్ని ముందుండి నడిపించి, తాలిబన్లపై పోరాడింది(us taliban news) ఈ కమాండోలే. నేషనల్ డైరక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ(ఎన్డీఎస్) పర్యవేక్షణలో వీరు విధులు నిర్వహించారు. కార్యకలాపాలు సాగించే ప్రాంతాల బట్టి ఎన్డీఎస్-01, ఎన్డీఎస్-02, ఎన్డీఎస్-03, ఎన్డీఎస్-04గా విభాగాలుంటాయి. ఏ విభాగానికి తగ్గట్టు అందుకు సంబంధించిన ప్రత్యేక పనులుంటాయి.
"ఖోస్ట్ రాష్ట్రంలో ఎన్డీఎస్ ఆధ్వర్యంలోని కమాండోలను కేపీఎఫ్ అని పిలుస్తారు. తాలిబన్లపై వీరు చివరి తూటా వరకు పోరాడారు. చివరకు స్థానిక తాలిబన్లతో సంప్రదింపులు జరిపారు. అక్కడి నుంచి కాబుల్ విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడి నుంచి వారిని ఖతార్‌కు తరలించింది అమెరికా."
-- అధికారులు.
అయితే ఈ కమాండోలు చట్టవిరుద్ధ కార్యకలాపాలు సాగిస్తుంటారని ఆరోపణలున్నాయి. అక్రమంగా హత్య చేయడం, హక్కుల ఉల్లంఘన, హింసకు పాల్పడుతుంటారని అప్రతిష్ఠ కూడా ఉంది.
మరోవైపు తాలిబన్ల ఆక్రమణతో దేశాన్ని వీడి ఉజ్బెకిస్థాన్‌కు వెళ్లారు అఫ్గాన్ వాయుసేన పైలట్లు. అక్కడి నుంచి వారు అమెరికా వాయుస్థావరమైన దోహాకు వెళ్లే అవకాశముంది. అక్కడి నుంచి తదుపరి ప్రణాళికలు రచిస్తారని సమాచారం. మొత్తం మీద 46 విమానాల్లో సైనిక సిబ్బంది, కుటుంబసభ్యులు, పైలట్లు వెళ్లారు.
వలసలు...
సైనికులే కాదు.. అఫ్గాన్‌లోని అనేకమంది విద్యావేత్తలు, నిపుణులు, ఉపాధ్యాయులు, ఇంజినీర్లు, జర్నలిస్టులు కూడా వలస వెళ్లిపోయారు. దేశంలోని మైనారిటీలు కూడా అఫ్గాన్ నుంచి బయటపడ్డారు. ఒకప్పుడు అఫ్గాన్‌లో 2లక్షల మంది హిందువులు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య వందల్లో మాత్రమే ఉంటుందని అంచనా.
(రచయిత- సంజీవ్ కుమార్ బారువా)
ఇదీ చూడండి:- Afghan Crisis: అతడి కోసం తాలిబన్ల కళ్లుగప్పి అమెరికా రెస్క్యూ ఆపరేషన్