ETV Bharat / international

అక్కడ కొత్త రకం కరోనా స్ట్రెయిన్‌ విజృంభణ - స్పత్నిక్ వి

కొత్త రకం స్ట్రెయిన్​ వైరస్​లు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే భారత్​, బ్రిటన్​లో ఈ తరహా రకాలు వెలుగుచూడగా.. ఇప్పుడు రష్యాలోనూ మరో స్ట్రెయిన్​ బయటపడింది. మాస్కోలో ఈ రూపాంతరం చెందిన వైరస్ వెలుగుచూసినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

covid cases in russia
రష్యా
author img

By

Published : Jun 17, 2021, 5:51 AM IST

Updated : Jun 17, 2021, 9:21 AM IST

ఎప్పటికప్పుడు రూపం మార్చుకుంటూ ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా వైరస్‌ మరోసారి రూపాంతరం చెందింది. తాజాగా కొత్త స్ట్రెయిన్‌ వైరస్‌ను కనుగొన్నట్లు రష్యాలోని గమలేయా నేషనల్‌ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. మాస్కోలో తొలిసారిగా వెలుగుచూడటం వల్ల ఈ వైరస్‌ను అదే నగరం పేరుతో పిలుస్తున్నట్టు తెలిపారు. రష్యాలో కేసుల సంఖ్య విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షలు చేయగా ఈ రకం వైరస్ వెలుగులోకి వచ్చినట్లు పేర్కొన్నారు.

తాజా స్ట్రెయిన్‌ వైరస్‌పై స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్‌ ఎంతమేర ప్రభావం చూపుతుందో తెలుసుకునే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమైనట్టు గమలేయా నేషనల్‌ సెంటర్‌ హెడ్‌ అలెగ్జాండర్‌ గింట్స్‌బర్గ్‌ వివరించారు. అయితే కొత్త స్ట్రెయిన్‌పై వ్యాక్సిన్‌ సమర్థంగానే పని చేస్తుందని విశ్వసిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ వైరస్‌పై పరిమిత సమాచారం మాత్రమే ఉందని వెల్లడించారు. రష్యాలో బుధవారం కొత్తగా 13.397 కరోనా కేసులు నమోదవగా వీటిలో 5,782 కేసులు మాస్కోలోనే వెలుగుచూశాయి. ఇదే రోజు దేశంలో 396 మరణాలు నమోదయ్యాయి.

ఇదీ చూడండి: కొవిడ్‌ బాధితుల్లో రక్తం గడ్డకట్టడానికి కారణమిదే.. !

Last Updated : Jun 17, 2021, 9:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.