ETV Bharat / international

చైనాలో జోరుగా టీకా పంపిణీ.. న్యూజిలాండ్​పై 'డెల్టా' పంజా

చైనాలో కరోనా వ్యాక్సినేషన్​ వేగంగా సాగుతోంది. ఇప్పటివరకు 214 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసినట్లు ఆ దేశ జాతీయ హెల్త్‌ కమిషన్‌ వెల్లడించింది. మరోవైపు డెల్టా వేరియంట్​ కారణంగా న్యూజిలాండ్​లోని ప్రధాన నగరం ఆక్లాండ్​లో లాక్​డౌన్ విధించింది ప్రభుత్వం.

china vaccination
చైనా వ్యాక్సినేషన్
author img

By

Published : Sep 13, 2021, 8:42 PM IST

కరోనా పుట్టినిల్లు చైనాలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జోరుగా సాగుతోంది. శనివారం నాటికి అక్కడ 214 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసినట్లు ఆ దేశ జాతీయ హెల్త్‌ కమిషన్‌ వెల్లడించింది. టీకా తయారీ నుంచి పంపిణీ వరకు గోప్యత పాటిస్తోన్న చైనా.. ఈ ఏడాది జూన్‌ 19న వ్యాక్సినేషన్‌లో 100 కోట్ల డోసుల మార్క్‌ను దాటింది.

ఆ తర్వాత కేవలం 10 వారాల్లోనే మరో బిలియన్‌ డోసులను పంపిణీ చేసింది. ఆగస్టు చివర్లో 200కోట్ల మార్క్‌ను దాటింది. 140 కోట్ల జనాభా కలిగిన చైనాలో దాదాపు 64 శాతం జనాభాకు వ్యాక్సినేషన్‌ పూర్తయ్యింది. అమెరికా, జపాన్‌, జర్మనీ లాంటి దేశాలతో పోలిస్తే టీకా పంపిణీలో చైనా ముందుంది. ఈ ఏడాది చివరి నాటికి 100 శాతం జనాభాకు రెండు డోసుల టీకా ఇవ్వాలని బీజింగ్‌ లక్ష్యంగా పెట్టుకుంది.

లాక్​డౌన్​లోనే ఆక్లాండ్..

సోమవారం కొత్తగా 33 కొవిడ్ కేసులు నమోదు కావటం వల్ల న్యూజిలాండ్​లోని అతిపెద్ద నగరం ఆక్లాండ్​లాక్​డౌన్​లోనే​ ఉండనుంది. సెప్టెంబర్​ 21వరకు లాక్​డౌన్​ను పొడిగిస్తున్నట్టు.. ఆదేశాలు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం.

దేశంలో అత్యంత ప్రమాదకరమైన డెల్టా వేరియంట్​ ప్రవేశించటం వల్ల నిబంధనలను అమలు చేస్తున్నట్లు న్యూజిలాండ్ ప్రధాని జసిందా ఆర్డెన్ తెలిపారు.

ఇదీ చదవండి: అమెరికా చేతికి 'అఫ్గాన్​ సూపర్​ కమాండోలు'.. ఏ క్షణమైనా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.