స్కేటింగ్ అంటే తెలియని వారుండరు. మంచుపై చేసే స్కేటింగ్ విన్యాసాలు అందరినీఆకట్టుకుంటాయి. కానీ గడ్డకట్టిన సరస్సుపై స్కేటింగ్ చేయడం చాలా అరుదు. అది అంత సులువేమీ కాదు.
రష్యాలోని సైబీరియాలో ఉన్న ప్రపంచ అతిపెద్ద, అతిలోతైన బైకాల్ సరస్సులో స్కేటింగ్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో 200మందికిపైగా స్కేటింగ్ ప్రియులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. నీరు గడ్డకట్టే చలిని సైతం వీరు లెక్కచేయలేదు.
'బైకాల్ ఇంటర్నేషనల్ స్కేటింగ్ మారథాన్' కార్యక్రమంలో భాగంగా ఈ పోటీలు నిర్వహించారు. ఇందులో 5 నుంచి 100 కిలోమీటర్ల దూరం వరకు నిర్వహించే పోటీలూ ఉన్నాయి.