ETV Bharat / international

థాయిలాండ్​​: చివరి రోజు కీలక భేటీల్లో మోదీ - modi thailand visits

తూర్పు ఆసియా, ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య సదస్సుల్లో ప్రధాని నరేంద్ర మోదీ నేడు పాల్గొననున్నారు. థాయిలాండ్​ పర్యటనలో ఉన్న మోదీ.. జపాన్​, వియత్నాం, ఆస్ట్రేలియా ప్రధానులతోనూ భేటీ కానున్నారు.

మోదీ
author img

By

Published : Nov 4, 2019, 9:27 AM IST

థాయిలాండ్​ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. నేడు కీలక భేటీలకు హాజరు కానున్నారు. తూర్పు ఆసియా కూటమితో పాటు ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్​సీఈపీ) సదస్సుల్లో పాల్గొననున్నారు.

సదస్సులతో పాటు పలు దేశాధినేతలతోనూ బ్యాంకాక్​లో మోదీ భేటీ కానున్నారు. జపాన్​ ప్రధాని షింజో ఆబే, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్​, వియత్నాం ప్రధాన మంత్రి గుయెన్ జువాన్​ ఫుస్​తో సమావేశమవుతారు.

ఆర్​సీఈపీ ఒప్పందం

ఆర్​సీఈపీ ఒప్పందానికి సంబంధించిన కీలక సమావేశం నేడు జరగనుంది. కూటమిలో భారత్​ చేరే విషయంపై సందిగ్ధం నెలకొన్న వేళ ఒప్పందంపైనా అనుమానాలు నెలకొన్నాయి. చైనా దిగుమతులపై వస్తోన్న అభ్యంతరాలను భారత్​ లేవనెత్తిన నేపథ్యంలో ఒప్పందం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Bhubaneswar (Odisha), Nov 02 (ANI): India Hockey Team defeated Russia in Bhubaneswar by 4-2 in first leg of Tokyo Olympics in Bhubaneswar. Mandeep Singh led the team from the front by scoring twice at Kalinga Stadium. India will take on Russia in the second-leg of qualifiers on Nov 2.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.