విదేశీ నేరస్థులపై ఆస్ట్రేలియా చర్యలను వేగవంతం చేసింది. మహిళలు, చిన్నారులను హింసించే కేసుల్లో 12 నెలల లేదా అంతకంటే ఎక్కువ కాలం శిక్ష పడ్డవారిని దేశంలోకి రానీయకుండా నిషేధం విధించింది. ఇప్పటికే దేశంలో ఉన్నవారిని పంపించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఇమిగ్రేషన్ మంత్రి డేవిడ్ కోల్‌మ్యాన్ తెలిపారు.
గతంలో ఇలాంటి కేసులో శిక్షపడ్డ అమెరికన్ గాయకుడు క్రిస్ బ్రౌన్, బాక్సింగ్ స్టార్ ప్లాయిడ్ మేవెదర్లకు వీసా నిరాకరించింది ఆస్ట్రేలియా.
కొంత కాలం క్రితం జైలు శిక్ష పూర్తైన న్యూజిలాండ్‌కు చెందిన నేరస్థులను స్వదేశానికి పంపించింది ఆస్ట్రేలియా. ఇందులో కొందరు తమ జీవిత కాలంలో ఎక్కువ భాగం ఇక్కడి జైళ్లలోనే గడిపారు. తిరిగి పంపించి వేయటంపై కివీస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.