మయన్మార్‌పై వరుణుడు విరుచుకుపడ్డాడు. వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మోన్ రాష్ట్రంలోని యీ టౌన్షిప్ జలదిగ్బంధమైంది. ఇళ్లన్నీ నీట మునిగాయి. చాలామంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు.
కొన్ని చోట్ల కొండచరియలు విరిగి పదుల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. రోడ్లన్నీ పూర్తిగా నీట మునిగాయి.
ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు.
"వరద ప్రభావంతో మయన్మార్‌లో ఒక్కవారంలోనే దాదాపు 12వేల మంది నిరాశ్రయులయ్యారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వారి సంఖ్య 38వేలకు పైమాటే" అని ఐరాస తెలిపింది.
ఇదీ చూడండి: మాస్కోలో విపక్షాల భారీ ప్రదర్శన