ETV Bharat / international

శ్రీలంక ఉగ్రదాడి సూత్రధారి అతడే! - శ్రీలంక హోంమంత్రి

శ్రీలంక ఉగ్రదాడి సూత్రధారిని గుర్తించినట్లు ఆ దేశ హోంమంత్రి శరత్ సోమశేఖర తెలిపారు. 2019లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరో వ్యక్తిని నిందితుడిగా గుర్తించినట్లు మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

easter attacks mastermind
శ్రీలంక ఉగ్రదాడి సూత్రధారి అతడే!
author img

By

Published : Apr 6, 2021, 10:20 PM IST

2019లో శ్రీలంకలో ఈస్టర్​ వేడుకల రోజున జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటన ప్రధాన సూత్రధారుడిని గుర్తించినట్లు శ్రీలంక హోంమంత్రి శరత్ వీరశేఖర తెలిపారు. నౌఫెర్ మౌలావి ఈ బాంబు దాడి ఘటనకు ప్రధాన కుట్రదారు అని శరత్ మీడియా సమవేశంలో వెల్లడించారు.

హజ్జుల్ అక్బర్ అనే వ్యక్తి నౌఫెర్​కు సహకరించాడని శరత్​ తెలిపారు. వీరు స్థానిక ఇస్లామిక్ ఉగ్ర సంస్థకు చెందిన వారని పేర్కొన్నారు. మారణకాండకు సంబంధించి 32 మంది నేరస్థులకు ఇప్పటికే శిక్ష విధించినట్లు వెల్లడించారు. 75 మందిని నిర్బంధించినట్లు పేర్కొన్నారు.

ఈ ఘటనకు సంబంధించి 211 మంది రిమాండ్​ కస్టడీలో ఉన్నారు.

ఐసిస్​తో సంబంధాలున్న ఇస్లామిస్ట్ ఉగ్రసంస్థ నేషనల్ థవీద్ జమాత్​కు చెందిన ఉగ్రవాదులు.. ఈస్టర్ వేడుకల వేళ రద్దీగా ఉండే చర్చ్​లు, హోటళ్లు లక్ష్యంగా 9 వరుస బాంబు పేలుళ్లకు, ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో దాదాపు 270 మంది ప్రాణాలు విడిచారు. ఇందులో 9 మంది భారతీయులు కూడా ఉన్నారు.

ఇదీ చదవండి:పీపీఈ కిట్​ ధరించి.. ఓటు వేసిన ఎంపీ కనిమొళి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.