ETV Bharat / international

మసూద్​ అజర్ మృతి?

జైషే మహ్మద్​ వ్యవస్థాపకుడు మసూద్​ అజర్​ పాకిస్థాన్​లో మృతిచెందాడని నిఘావర్గాల సమాచారం. గత కొంతకాలంగా మసూద్​ మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నాడు​.

మసూద్​ అజర్ మృతి?
author img

By

Published : Mar 3, 2019, 6:09 PM IST

Updated : Mar 3, 2019, 6:19 PM IST

పాకిస్థాన్​ కేంద్రంగా నడుస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్​ అధినేత మసూద్​ అజర్​ మృతిచెందారు. ఇస్లామాబాద్​ సైనిక ఆసుపత్రిలో శనివారం మరణించినట్లు నిఘావర్గాల సమాచారం. మసూద్​ గత కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో భాదపడుతున్నారు. పాకిస్థాన్​ రావల్పిండిలోని ఆర్మీ ఆసుపత్రిలోనూ చికిత్సపొందుతూ మృతి చెందినట్లు సమాచారం. అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

మసూద్​ తమదేశంలోనే ఉన్నాడని ఇటీవలే పాకిస్థాన్​ ప్రభుత్వం అంగీకరించింది. జైషే మహ్మద్​ వ్యవస్థాపకుడి ఆరోగ్యం సరిగా లేదని ఆ దేశ విదేశాంగ మంత్రి మహమ్మద్​ ఖురేషి వెల్లడించారు.

భారత్​ అంటే గిట్టదు

మసూద్​ పూర్తి పేరు మౌలానా మసూద్​ అజార్​. మన దేశంలో జరిగే ఏ ఉగ్రదాడిలోనైనా పాకిస్థాన్​ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ హస్తం ఉంటుంది. ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడి ఇందుకు ఉదాహరణ.

భారతదేశం అంటే మసూద్​కు గిట్టదు. కశ్మీర్‌ను భారత్‌ నుంచి విడగొట్టాలన్న కుట్రతో ఎన్నో ముష్కరదాడులకు నేతృత్వం వహించాడు. 2001లో దిల్లీలోని పార్లమెంటుపై ఆత్మాహుతి దాడి, 2016లో పఠాన్‌కోట్‌ ఉగ్రదాడి, 2016లోనే ఉరీ సైనికస్థావరంపై దాడి... ఇలా అనేక ఉగ్ర కార్యకలపాలకు మసూద్​ సూత్రధారి.

ఒసామా బిన్​లాడెన్​కు మసూద్​ అత్యంత సన్నిహితుడు. 1999లో ఇండియన్​ ఎయిర్​లైన్స్​ విమానాన్ని అఫ్గాన్​లో హైజాక్​ చేశారు ఉగ్రవాదులు. అనంతరం చర్చల్లో భాగంగా మసూద్​ అజార్​ను భారత్​ విడిచిపెట్టాల్సి వచ్చింది. మసూద్​ విడుదలైన రాత్రే పెద్ద విందు ఇచ్చాడు బిన్​లాడెన్​.

ఐరాస మసూద్​ను అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించాలని ఎన్నో ఏళ్ల నుంచి భారత్​ ప్రయత్నిస్తోంది.

undefined

Intro:Body:Conclusion:
Last Updated : Mar 3, 2019, 6:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.