ETV Bharat / international

జస్ట్​ చిన్న హెయిర్​కట్.. టిప్​ మాత్రం భారీగా - లేటెస్ట్ వైరల్ వీడియో

మహా అయితే పదుల్లో లేదంటే వంద రూపాయల్లో మీరు టిప్ ఇచ్చుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం తనకు చిన్న హెయిర్​ కట్ చేసినందుకు రూ.37 వేలకు పైగా టిప్ ఇచ్చాడు. ఇంతకీ దీని సంగతేంటి?

Man offers $500 tip to hairdresser
వైరల్ న్యూస్
author img

By

Published : Aug 11, 2021, 7:30 PM IST

జస్ట్ కొన్ని వెంట్రుకలు కట్​(హెయిర్ కట్) చేసినందుకు ఏకంగా 500 డాలర్లు టిప్​ ఇచ్చాడు ఓ వ్యక్తి. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన ఆ హెయిర్​ డ్రస్సర్.. తన భావోద్వేగాలను ఆపుకోలేకపోయింది. టిప్​ ఇచ్చిన వ్యక్తిని హగ్ చేసుకుని, అతడితో సెల్ఫీ దిగింది.

ఇంతకీ ఏమైంది?

యూట్యూబర్ స్టీవెన్ సచ్​పీరో.. పలు వీడియోలతో నెటిజన్లను అలరిస్తున్నాడు. ఈ మధ్య పలు సెలూన్స్​కు వెళ్లి, హెయిర్​ డ్రస్సర్స్​​కు​ ఊహించనంత టిప్​ ఇచ్చి, వారిని ఆశ్చర్యపరుస్తూ వస్తున్నాడు.

అలానే ఓ సెలూన్​కు వెళ్లిన స్టీవెన్.. కేవలం కొన్ని వెంట్రుకలు మాత్రమే కట్ చేయించుకుని, ఇక ఆపేయమని సదరు మహిళా హెయిర్​ డ్రస్సర్​కు చెప్పాడు. డబ్బులు వద్దులే అని ఆమె చెప్పింది. అయినా సరే 500 డాలర్లను(భారత కరెన్సీ ప్రకారం రూ.37 వేలు) టిప్​గా ఇచ్చాడు. దీంతో ఉబ్బితబ్బిబ్బైన ఆ హెయిర్​ డ్రస్సర్​.. తన ఎమోషన్​ను కంట్రోల్ చేసుకోలేకపోయింది.

అయితే ఈ డబ్బు తన ఇంటి అద్దె సమస్యను తీర్చేసిందని ఆ మహిళ​ చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారి, సోషల్ మీడియా యూజర్లను ఆకర్షిస్తోంది. మరోవైపు వ్యూస్, లైక్స్​తో దూసుకెళ్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.