ETV Bharat / international

మాజీ ప్రేయసిపై అత్యాచారం.. అలా చేస్తే తననే పెళ్లాడుతుందని...

తనను వదిలి మరో యువకుడ్ని చూసుకుందని.. ప్రేయసిపై అత్యాచారం చేశాడో వ్యక్తి. అలా చేస్తే.. గర్భవతి అవుతుందని, అప్పుడు తనను పెళ్లిచేసుకోవడం తప్ప ఆ యువతికి మరో మార్గం ఉండదని భావించాడు. సింగపూర్​లో జరిగిన ఈ ఘటన సినిమా స్టోరీని తలపిస్తోంది. టీనేజీలో మొదలైన ప్రేమ.. ఎక్కడకు దారి తీసింది? చివరకు ఏం జరిగింది?

Man admits raping ex-girlfriend
మాజీ ప్రేయసిపై అత్యాచారం.. అలా చేస్తే తననే పెళ్లాడుతుందని..
author img

By

Published : Oct 15, 2021, 1:22 PM IST

తనను వదిలేసిన ఓ యువతిని మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేశాడో వ్యక్తి. కొత్త ప్రియుడితో శృంగారం చేశావా అని పిచ్చి పిచ్చి ప్రశ్నలతో, కత్తితో బెదిరింపులకు పాల్పడి చివరకు ఆమెపై అత్యాచారం చేశాడు. సింగపూర్​లో జరిగిందీ ఘటన.

స్కూల్లోనే లవ్​..

నిందితుడు పదో తరగతిలో ఉన్నప్పుడు.. 14 ఏళ్ల బాలికతో పరిచయం ఏర్పడింది. అతడికి అప్పుడు 16 సంవత్సరాలు. ఆ వయసు నుంచే ఇద్దరూ డేటింగ్​లో ఉన్నారు. ఆమెతో శృంగారం చేయగా, 14 ఏళ్ల వయసులో ఓసారి, 23 ఏళ్ల వయసులో మరోసారి బాధితురాలు గర్భవతి అయింది. కానీ.. రెండుసార్లు అబార్షన్​ చేయించుకుంది.

మోసం చేశాడని విడిపోయి..

నిందితుడు తనను మోసం చేశాడని 2019 ఫిబ్రవరి 11న అతడితో విడిపోయింది బాధితురాలు. దీనిని జీర్ణించుకోలేని ఆ యువకుడు మాత్రం మళ్లీ కలవాలని కోరుకున్నాడు. ఈ క్రమంలోనే యువతి అతడి వాట్సాప్​ను బ్లాక్​ చేసింది. కానీ.. ఆమెను కలిసేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. కానీ.. అవేమీ ఫలించలేదు.

విడిపోయిన రెండు వారాల తర్వాత.. ఆమెకు ఫోన్​ చేసి పెళ్లి చేసుకుందామని చెప్పగా నిరాకరించింది. కోపంతో ఊగిపోయిన ఆ యువకుడు.. ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని కుట్రపన్నాడు.

ఇంటికి వెళ్లి కాపుగాసి..

ఓరోజు అర్ధరాత్రి సమయంలో.. ఆమె ఇంటికి వెళ్లి కాపుగాశాడు. ఆ యువతి రాగానే మాట్లాడుకునేందుకు హోటల్​కు వెళ్దామని చెప్పగా.. అతడిని నమ్మి వెంటవెళ్లింది. అప్పుడే ఆమె చేతికి ఉంగరం చూసి బాధితుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. క్షమించమని బాధపడ్డ యువతి.. ఒంటిగంట సమయంలో అతడితో కలిసి ఇంటికి వెళ్లింది.

ముందే తను కొనుగోలు చేసిన ఓ కత్తితో.. ఆమెను బెదిరించాడు. మరొకరితో సెక్స్​ చేశావా అంటే నో అని బదులిచ్చిందా యువతి. మెడ దగ్గర కత్తి పెట్టి చెప్పమని గట్టిగా అరిస్తే ప్రాణభయంతో.. ఔనని ఒప్పుకుంది.

నన్నే పెళ్లి చేసుకోవాలి..

అప్పుడే మరో ప్లాన్​ వేసిన నిందితుడు.. ఆమెతో సెక్స్​ చేస్తే ప్రెగ్నెంట్ అవుతుందని, అప్పుడు తనను పెళ్లిచేసుకోవడం తప్ప వేరే మార్గం లేదని భావించాడు. యువతి తొడలపై కత్తిగాట్లు పెట్టి.. అత్యాచారం చేశాడు. చివరకు అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు.. తన కొత్త బాయ్​ఫ్రెండ్​తో వివరాలు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయించింది.

గురువారం ఉదయం అతడిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. అతడికి 13 ఏళ్ల జైలు శిక్ష విధించాలని బాధితురాలి తరఫు న్యాయవాది కోరారు. అయితే ఆ యువతికి ఇప్పటికీ నిందితుడిపై ప్రేమ ఉందని, సామాజిక మాధ్యమాల్లో దానిని వ్యక్తపరుస్తూనే ఉందని కోర్టుకు వివరించారు డిఫెన్స్​ లాయర్​. శిక్షను సగానికి తగ్గించాలని కోరారు.

బాధితురాలు లైంగిక వేధింపులకు పాల్పడితే ప్రేమ అని ఎలా అంటారని ప్రశ్నించిన జడ్జి.. కేసు విచారణను వాయిదా వేశారు.

ఇవీ చూడండి: ఉద్యోగి మనసు విరిగింది.. 'ది గ్రేట్‌ రెజిగ్నేషన్‌' సునామీ మొదలైంది!

Car Runs On Wine: మద్యం తాగి పరుగులు తీస్తున్న యువరాజు కారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.