ETV Bharat / international

ఆ చైనా ప్రాజెక్టులను భారీగా దెబ్బకొట్టిన కరోనా!

ఆసియా, ఆఫ్రికా, ఐరోపాకు.. రహదారి, సముద్ర మార్గాలతో కలుపుతూ చైనా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రాజెక్టును ప్రారంభించింది. కానీ ప్రస్తుతం ఈ భారీ ప్రాజెక్టుపై కరోనా మహమ్మారి ప్రభావం పడిందని ఆ దేశ మీడియా వెల్లడించింది.

Majority of China's BRI projects abroad adversely affected by COVID-19 pandemic: Official
ఆ చైనా ప్రాజెక్టులను భారీగా దెబ్బకొట్టిన కరోనా!
author img

By

Published : Jun 28, 2020, 8:24 PM IST

చైనా కలల ప్రాజెక్టు బెల్ట్‌ అండ్‌ రోడ్‌ (బీఆర్‌ఐ)కు కరోనా వెరస్‌ సెగ బాగానే తగిలింది. ఈ మహా నిర్మాణంలోని చాలా ప్రాజెక్టులపై వైరస్‌ ప్రతికూల ప్రభావం చూపిందని చైనీస్‌ అధికారి ఒకరు మీడియాకు వివరించారు. ఆసియా, ఆఫ్రికా, ఐరోపాను రహదారి, సముద్ర మార్గాలతో కలుపుతూ చైనా ఈ మహానిర్మాణం ఇదివరకే తలపెట్టింది.

ఈ మహా నిర్మాణంలోని ఐదో వంతు ప్రాజెక్టులపై కరోనా వైరస్‌ మహమ్మారి తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందని విదేశాంగ మంత్రిత్వ శాఖలోని అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల డైరెక్టర్‌ జనరల్‌ వాంగ్‌ షియావోలాంగ్‌ చెప్పారు. దాదాపు 40% ప్రాజెక్టులపై పూర్తిగా, మరో 30-40% ప్రాజెక్టులపై ఎంతో కొంత మేరకు ప్రభావం పడిందన్నారు. ఈ నేపథ్యంలో గత వారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన చైనా బీఆర్‌ఐ ప్రాజెక్టుల్లో పనులు వెంటనే ఆరంభించాలని సూచించింది.

దాదాపు 60 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా-పాకిస్థాన్‌ ఆర్థిక నడవా (సీపెక్‌)కూ వైరస్‌ దెబ్బ బాగానే తగిలింది. ఈ రహదారి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి వెళ్తుండటంతో భారత్‌ నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మలేసియా, బంగ్లాదేశ్, ఇండోనేసియా, పాకిస్థాన్‌, కాంబోడియా, శ్రీలంకలోని ప్రాజెక్టుల్లోనూ పనులు ఆలస్యం కావడంతో డ్రాగన్‌ గుర్రుగా ఉందట.

కాంబోడియాలోని సిహనౌకువిలే ప్రత్యేక ఆర్థిక మండలి, ఇండోనేసియాకు చెందిన జకార్తా-బాండంగ్‌ హైస్పీడ్‌ రైలు ప్రాజెక్టులపైనా వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉందని తెలిసింది. 2951 ప్రాజెక్టులున్న ఈ బెల్ట్‌ అండ్‌ రోడ్‌ పూర్తి విలువ 3.87 ట్రిలియన్‌ డాలర్లుగా అంచనా వేస్తున్నారు.

ఇదీ చూడండి:ఘర్షణకు ముందే మార్షల్‌ యోధులను పంపిన చైనా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.