ETV Bharat / international

ఎన్నికల్లో రాజపక్స జయభేరి- 145 సీట్లు కైవసం - శ్రీలంక తాజావార్తలు

శ్రీలంక పార్లమెంటరీ ఎన్నికల్లో అధికార రాజపక్స సోదరుల పార్టీ విజయదుందుభి మోగించింది. మొత్తం 225 స్థానాలకు గాను 145 చోట్ల విజయం సాధించింది.

LANKA-POLL-RESULTS
రాజపక్స ఘన విజయం
author img

By

Published : Aug 7, 2020, 7:59 AM IST

శ్రీలంక పార్లమెంటరీ ఎన్నికల్లో గొటబాయ రాజపక్స పార్టీ 'శ్రీలంక పీపుల్స్ ఫ్రంట్' ఘన విజయం సాధించింది. మూడింట రెండొంతుల మెజారిటీతో విజయఢంకా మోగించారు రాజపక్స సోదరులు. మొత్తం 225 స్థానాలకు గాను 145 సీట్లను కైవసం చేసుకున్నారు.

గతేడాది నవంబర్​లో గొటబాయ రాజపక్స అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత నుంచి మహిందా రాజపక్స ఆపద్ధర్మ ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ గెలుపు అధికార పార్టీపై ప్రజలకు ఉన్న నమ్మకమని రాజపక్స సోదరులు వ్యాఖ్యానించారు. అంతకుముందు భారత ప్రధాని నరేంద్రమోదీ తమకు ఫోన్​ ద్వారా శుభాకాంక్షలు తెలిపారని మహిందా ట్వీట్ చేశారు.

71 శాతం పోలింగ్..

కరోనా మహమ్మారి భయాల నేపథ్యంలో బుధవారం జరిగిన పోలింగ్ శాంతియుతంగా ముగిసింది. మొత్తం 71 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలుత ఏప్రిల్​లోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. కరోనా నేపథ్యంలో రెండు సార్లు వాయిదా పడ్డాయి.

ఇదీ చూడండి: రాజకీయ సంక్షోభం పరిష్కారం దిశగా 'ప్రచండ' చర్చలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.