ETV Bharat / international

కరోనా 2.0: నెల రోజుల తర్వాత వుహాన్​లో మళ్లీ..! - coronavirus latest news china

కరోనా నుంచి కొలుకుని పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమైన చైనా వుహాన్​లో మళ్లీ వైరస్​​ కలవరం మొదలైంది. కొవిడ్​-19​ కేంద్ర బిందువైన వుహాన్​ నగరంలో ఆరు కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదు కాకుండా జాగ్రత్తలు తీసుకోనందుకు స్థానిక అధికారిని తొలిగించింది ప్రభుత్వం.

Local official sacked as COVID-19 epicentre Wuhan reports six new cases
కరోనా 2.0: నెల రోజుల తర్వాత వుహాన్​లో మళ్లీ..!
author img

By

Published : May 11, 2020, 5:44 PM IST

కొన్ని రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని చైనా వుహాన్​లో ఆరు కొత్త కేసులు వెలుగు చూశాయి. వేగంగా పునరుద్ధరణ చర్యల్లో నిమగ్నమైన ప్రభుత్వానికి వుహాన్​లో మళ్లీ కేసులు నమోదుకావడం కలవరానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని అరికట్టడంలో విఫలమైన కాలనీ వర్కింగ్​ కమిటీ కార్యదర్శిని పదవి నుంచి తొలగించింది ప్రభుత్వం.

వైరస్​కు కేంద్ర బిందువై వుహాన్​లో మహమ్మారి వ్యాప్తిని కొద్ది రోజుల్లోనే కట్టడి చేయగలిగింది చైనా. దేశవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి 23న కఠిన లాక్​డౌన్​ విధించి వైరస్​ వ్యాప్తిని అడ్డుకుంది. ఏప్రిల్​ 8న వుహాన్ సహా పలు ప్రాంతాల్లో లాక్​డౌన్​ ఎత్తివేసింది. దీంతో ఆ ప్రాంతాల్లో సాధారణ స్థితి నెలకొంది. జిమ్​లు, ఇతర వినోద కేంద్రాలతో పాటు.. షాంఘై, డిస్నీ ల్యాండ్​ వంటి ప్రముఖ పర్యటక ప్రదేశాలు తెరుచుకున్నాయి.

చైనా జాతీయ ఆరోగ్య కమిషన్​ ప్రకారం.. దేశంలో 17 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 82,918 మంది కరోనా బారిన పడ్డారు.

ఇదీ చదవండి:కరోనా మృతుల పక్కనే సాధారణ రోగులకు చికిత్స!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.