ఇండోనేసియాలో కురుస్తోన్న భారీ వర్షాలకు రహదారి పక్కన కొండచరియలు విరిపడి 11 మంది మృతిచెందారు. మరో 18 మంది గాయపడ్డారు. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు.. భారీ యంత్రాలతో శిథిలాలను తొలగిస్తున్నారు.
కొండచరియలు విరిగిపడటం వల్ల రోడ్లు, వంతెనలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆ దేశ అధికారులు తెలిపారు. అధిక సంఖ్యలో ప్రజలు ఇక్కడ కొండ ప్రాంతాలు, నదీప్రాంతాల్లో నివసిస్తుండడం వల్ల ఏటా వర్షాకాలంలో ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నా రు.
ఇదీ చూడండి: జావా సముద్రంలో ఇండోనేసియా విమాన శకలాలు గుర్తింపు!