ETV Bharat / international

పాక్​లో వరదల బీభత్సం-48 మంది మృతి

పాకిస్థాన్​లో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఖైబెర్​ పఖ్తున్​ఖ్వా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. వారం రోజుల్లో 48 మంది ప్రాణాలు కోల్పోయారు, 67 మంది గాయపడ్డారు. 250కిపైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి.

Pakistan
పాక్​లో వరదల బీభత్సం
author img

By

Published : Sep 4, 2020, 5:32 AM IST

గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలు వాయవ్య పాకిస్థాన్​లో బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలకు తోడు కొండచరియలు విరిగిపడి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తోంది. ఇప్పవరకు 48 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 67 మంది తీవ్రంగా గాయపడ్డారు. 250కుపైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి.

ఖైబెర్​ పఖ్తున్​ఖ్వా రాష్ట్రంలోని స్వాత్​, బ్యూనెర్​, షాంగ్ల, కొహిస్తాన్​, చిత్రాల్​ జిల్లాలు నీట మునిగాయి. రోడ్లపై విరిగిపడిన కొండచరియలను తొలగించేందుకు సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. పర్యటకులు, స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ఇదీ చూడండి: 'భారతీయుల ఆశయాలను కరోనా సంక్షోభం అడ్డుకోలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.