ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్(Kim news today) మరోసారి అమెరికాపై మండిపడ్డారు. అగ్రరాజ్యం వల్లే కొరియా ద్వీపకల్పంలో అస్థిరత, యుద్ధవాతావరణం నెలకొందని ఆరోపించారు. అమెరికా సహా తమ శత్రుదేశాలను దీటుగా ఎదుర్కొనేందుకు.. ఆయుధ సంపత్తిని పెంచుకుంటామని, అజేయమైన సైన్యాన్ని నిర్మిస్తానని కిమ్(Kim news today) ప్రతిన పూనినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
ఆయుధ వ్యవస్థ ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న కిమ్(Kim news today).. అమెరికాను నమ్మలేనని అన్నారు. దక్షిణ కొరియాపై దాడి చేసే ఉద్దేశం లేదని, మరో దేశం తమపైకి రాకుండా ఉండేందుకే శక్తిమంతమైన అణ్వాయుధాలు రూపొందించుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
''ఉత్తర కొరియాపై దాడి చేసే ఉద్దేశం తమకు లేదని అమెరికా ప్రభుత్వం తరచూ చెబుతూ వస్తోంది. కానీ.. వారి చర్యలను మేం నమ్మడానికి ఎటువంటి ఆధారం లేదు. అమెరికానే.. కొరియా ఉభయదేశాల్లో ఉద్రిక్తతలకు కారణం.''
- కిమ్ జోంగ్ ఉన్, ఉత్తర కొరియా అధినేత
అణ్వాయుధ పరీక్షలు, బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలను భారీగా నిర్వహిస్తున్న ఉత్తర కొరియాపై అంతర్జాతీయంగా ఆంక్షలు కొనసాగుతున్నాయి. వాటిని బేఖాతరు చేస్తూ ఇటీవల.. వరుస ప్రయోగాలు నిర్వహించింది కిమ్ సర్కార్(Kim news today). అత్యాధునిక హైపర్ సోనిక్ క్షిపణిని కూడా ప్రయోగించింది.
అమెరికా ప్రధాన భూభాగాన్ని చేరుకోగల.. అణు క్షిపణులను 2017లో పరీక్షించింది ఉత్తర కొరియా. అమెరికా దాడుల నుంచి తనను తాను రక్షించుకోవడానికే ఆయుధాలను సమకూర్చుకుంటున్నామని అప్పట్లో ప్రకటించింది. ఈ వరుస ప్రయోగాలు ప్రపంచ దేశాలను కలవరానికి గురిచేసింది. అమెరికా, ఉత్తర కొరియా మధ్య ఉద్రిక్తతలతో మరో ప్రపంచ యుద్దం తప్పదేమోనని ఆందోళన వ్యక్తమైంది.
అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కిమ్ మధ్య 2018లో చర్చలు జరిగినా.. అవి అర్థాంతరంగానే ముగిశాయి. అప్పటి నుంచి ఇరుదేశాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది.
మరోసారి ఉత్తర కొరియాతో చర్చలకు సిద్ధమని జో బైడెన్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం.. తరచూ ఆహ్వానిస్తోంది. అయితే.. చర్చలకు పిలవటం తమ పట్ల శత్రుత్వాన్ని కప్పిపుచ్చుకునే నీచమైన ఆలోచనగా అభివర్ణించారు కిమ్. అమెరికా తమపై ఆంక్షలు ఎత్తివేయాలని లేదా సియోల్లో సైనిక విన్యాసాలు ఆపాలని డిమాండ్ చేస్తున్నారు.
దక్షిణ కొరియాతో ఓకే..
దక్షిణ కొరియాతో (south korea news) సంబంధాలను పునరుద్ధరించేందుకు కొద్దిరోజుల కింద సుముఖత వ్యక్తం చేశారు కిమ్ (north korea president). అక్టోబర్ తొలినాళ్లలోనే ఆ దిశగా చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సూత్రప్రాయంగా తెలిపారు.
ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవీ చూడండి: క్షిపణుల బెదిరింపులతో ఉత్తర కొరియాకు ఎదురు దెబ్బ