గత కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌కు సంబంధించిన మరో వార్త తాజాగా చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా దేశంలోని ఓ భారీ పర్యటక రిసార్టు నిర్మాణంలో పని చేస్తున్న కార్మికులకు.. కిమ్ ధన్యవాదాలు చెప్పారని ఉత్తర కొరియా అధికారిక మీడియా కథనం ప్రచురించింది.
"వోన్సన్-కల్మా రిసార్టు నిర్మాణానికి శ్రమిస్తున్న కార్మికులు, అధికారులకు.. గౌరవనీయులైన కిమ్ జోంగ్ ఉన్ ధన్యవాదాలు తెలిపారు."
-- ఉత్తర కొరియా అధికారిక మీడియా.
ఈ కథనంలో కిమ్ తాజా కార్యకలాపాలు, ఆరోగ్యంపై ఎలాంటి వివరాలు లేకపోవడం గమనార్హం.
ఈ నెల 15న కిమ్ తన తాత 108వ జయంతి కార్యక్రమానికి గైర్హాజరయ్యారు కిమ్. దేశంలోనే అతి ముఖ్యమైన రోజు అది. అప్పటి నుంచి కిమ్ ఆరోగ్యంపై అనేక ఊహాగానాలు, వార్తలు వస్తున్నాయి. కిమ్ చనిపోయి ఉండొచ్చని.. ఆయనకు కరోనా వైరస్ సోకి ఉండొచ్చని లేదా ఆ మహమ్మారి బారిన పకుండా ఉండేందుకు విడిగా ఉంటున్నారని.. తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని.. ఇలా రకరకాల వార్తలు వచ్చాయి.
'కిమ్ బతికే ఉన్నారు...'
అయితే కిమ్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలను దక్షిణ కొరియా మొదటి నుంచి ఖండిస్తూనే ఉంది. కిమ్ బతికే ఉన్నట్టు.. ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్టు తమకు చాలా నమ్మకంగా ఉందని తెలిపింది.
కిమ్‌కు ఏదైనా జరిగితే వెంటనే పసిగట్టే నిఘా వ్యవస్థ తమకుందని దక్షిణ కొరియా మంత్రి కిమ్ యోన్ చుల్ తెలిపారు. అయితే ఇప్పటివరకు తమకు అలాంటి సమాచారం లభించకపోవడం వల్లే కిమ్ ఆరోగ్యంగా ఉన్నారని కచ్చితంగా చెబుతున్నట్టు వెల్లడించారు.
ఇదీ చూడండి:- కిమ్ అలా కావడానికి కారణం జున్ను!