ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్... కరోనా విజృంభణ తర్వాత తొలిసారి బయటకు వచ్చారు. నేడు ఆ దేశ మాజీ అధ్యక్షుడు, తన తండ్రి కిమ్ జోంగ్ ఇల్ జయంతి. ఈ సందర్భంగా ప్యాంగ్యాంగ్లోని కుమ్సుసాన్ ప్యాలెస్లో తన తండ్రి, తాత కిమ్ ఇల్ సుంగ్కు నివాళులు అర్పించారు.
కిమ్ తండ్రి, తాత జయంతి, వర్ధంతికి దేశవ్యాప్తంగా సెలవు ప్రకటిస్తుంది అక్కడి ప్రభుత్వం. ఇల్ జయంతి సందర్భంగా షైనింగ్ స్టార్ పేరిట వేడుకలను జరుపుకొంటారు ఉత్తర కొరియన్లు.
మరో 30 రోజులు పొడిగింపు...
చైనాలో ఇప్పటివరకు కరోనా ధాటికి 1600 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కొరియా ప్రభుత్వం ఆ దేశానికి వెళ్లే విమాన, రైలు మార్గాలను నిలిపివేసింది. వైరస్ లక్షణాలు కలిగిన వ్యక్తుల నిర్బంధాన్ని మరో 30 రోజులకు పొడిగించినట్లు స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: ప్లాస్టిక్ బాటిళ్లతో సుందరమైన శ్వేత ఏనుగు!