ETV Bharat / international

ఓలి, ప్రచండ మధ్య కుదరని సయోధ్య - నేపాల్ కమ్యునిస్టు పార్టీ సెంట్రల్ సెక్రెటేరియట్ సమావేశం

నేపాల్ ప్రధాని ఓలి, అధికార పార్టీ అధ్యక్షుడు ప్రచండ మధ్య విభేదాలను పరిష్కరించడానికి ఏర్పాటైన సెంట్రల్ సెక్రెటేరియట్ సమావేశంలో ఎలాంటి ఫలితం తేలలేదు. ఇద్దరు నేతలు ఏకాంతంగా నాలుగు గంటల పాటు చర్చించినప్పటికీ.. పరిష్కారం లభించలేదు. ఆదివారం కీలకమైన స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనుంది.

NEPAL
నేపాల్
author img

By

Published : Dec 6, 2020, 6:22 AM IST

శనివారం జరిగిన నేపాల్ కమ్యునిస్టు పార్టీ సెంట్రల్ సెక్రెటేరియట్ సమావేశం అసంపూర్తిగా ముగిసింది. ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి, పార్టీ అధ్యక్షుడు పుష్ప కుమార్ దహాల్ ప్రచండ మధ్య తలెత్తిన విభేదాలను పరిష్కరించడంలో ఈ సమావేశం విఫలమైంది.

బలువాటార్​లోని ప్రధాని అధికారిక నివాసంలో ఈ భేటీ జరిగింది. పార్టీలోని సమస్యలపై చర్చించామని, అయితే ఎలాంటి పరిష్కారం లభించలేదని ఎన్​సీపీ ప్రతినిధి నారాయన్ కాజీ శ్రేష్ఠ తెలిపారు. నాలుగు గంటల పాటు వీరిద్దరూ ఏకాంతంగా సమావేశమైనట్లు వెల్లడించారు. ఆదివారం జరగనున్న స్టాండింగ్ కమిటీ సమావేశంలో అన్ని అజెండాలపై చర్చించేందుకు నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.

గత సమావేశాల్లో ప్రచండ, ఓలి సమర్పించిన రెండు వేర్వేరు ఆరోపణ పత్రాలపై పార్టీ స్టాండింగ్ కమిటీ ఆదివారం చర్చించనుంది. పార్టీని, ప్రభుత్వాన్ని నడపడంలో ఓలి విఫలమయ్యారని ప్రచండ ఆరోపించారు. ఆయనపై అవినీతి ఆరోపణలు మోపారు. మరోవైపు, వీటిని ఖండించిన ఓలి... అవినీతి ఆరోపణలను రుజువు చేయాలని, లేదంటే క్షమాపణలు చెప్పాలని స్పష్టం చేశారు. పార్టీని సంప్రదించకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్నారన్న ప్రచండ ఆరోపణలను ఖండించారు. పార్టీ వ్యవహారాలు నిర్వహించేందుకు ప్రచండ సహకరించడం లేదని ఆరోపణలు గుప్పించారు.

అలా మొదలైంది..

భారత్​లోని పలు భూభాగాలను తమవిగా చూపుతూ కొత్త మ్యాప్​ను తీసుకొచ్చింది ఓలి ప్రభుత్వం. దీంతో ఇరుదేశాల సంబంధాలు బలహీనపడ్డాయి. ఈ క్రమంలోనే తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర జరుగుతోందని భారత్​పై ఆరోపణలు చేశారు ఓలి. ఆ తర్వాత.. అధికార సీపీఎన్​ పార్టీ నేతలు ప్రచండ, సీనియర్​ సభ్యుడు మాధవ్​ కుమార్​ నేపాల్​లు.. పార్టీ ఛైర్మన్​ పదవి, ప్రధాని పదవికి ఓలి రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు. దీంతో రాజకీయ సంక్షోభం మొదలైంది. అప్పటి నుంచి ఓలి, ప్రచండల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

ఇదీ చదవండి-నేపాల్​ అధికార పార్టీలో భగ్గుమన్న విభేదాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.