ETV Bharat / international

పాకిస్థాన్​కు కశ్మీర్ కంఠసిర: ఇమ్రాన్​ఖాన్​ - పాక్

కశ్మీర్​పై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పాకిస్థాన్​ ప్రధానమంత్రి ఇమ్రాన్​ఖాన్​. పాక్​లో కశ్మీర్​ అంతర్భాగం అని అర్థం వచ్చేలా 'కంఠ సిర'(మెడ నరం)తో పోల్చారు.

ఇమ్రాన్​ఖాన్​
author img

By

Published : Sep 6, 2019, 4:48 PM IST

Updated : Sep 29, 2019, 4:07 PM IST

ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత అంతర్జాతీయ వేదికల మీద భారత్‌ను దోషిగా నిలబెట్టేందుకు పాక్​ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అయినప్పటికీ పాక్​ నేతలు తమ నోటి దురుసును వదలిపెట్టడం లేదు. పాకిస్థాన్​ రక్షణ, అమరవీరుల దినోత్సవం సందర్భంగా కశ్మీర్​ తమ భూభాగంలో అంతర్భాగమనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​.

"కశ్మీర్​ పాకిస్థాన్‌కు మెడలోని నరం వంటిది. జమ్ముకశ్మీర్‌లో ప్రత్యేక ప్రతిపత్తిని ఎత్తివేయడం వల్ల దేశ భద్రత, సమగ్రతకు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఆర్టికల్‌ 370 ఎత్తివేత తర్వాత జమ్ముకశ్మీర్‌ పరిస్థితిపై ప్రపంచ దేశాలు సహా ఐక్యరాజ్యసమితికి వివరించేందుకు పాక్​ చురుకైన దౌత్య ప్రచారం చేస్తోంది. భారత అణ్వస్త్ర కేంద్రాల భద్రతపై ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా దృష్టి సారించాలని అభ్యర్థిస్తున్నాం. లేదంటే దక్షిణాసియాకే కాకుండా ప్రపంచానికే ముప్పు ముంచుకు వస్తుంది. ఇందుకు ప్రపంచ దేశాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది."

-ఇమ్రాన్​ ఖాన్​, పాకిస్థాన్​ ప్రధాని

ఇదీ చూడండి: నమో 2.0: దౌత్యపరంగా సూపర్​ హిట్​

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Sep 29, 2019, 4:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.