ETV Bharat / international

'ఉగ్రవాదంపై పోరులో కొన్ని దేశాలది ద్వంద్వ వైఖరి' - విదేశాంగ మంత్రి జయశంకర్

ఐక్యరాజ్య భద్రతా మండలి నిర్వహించిన సమావేశంలో విదేశాంగ మంత్రి జయశంకర్ వర్చువల్​గా పాల్గొన్నారు. కొన్ని దేశాలు ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని పాక్​పై పరోక్ష విమర్శలు గుప్పించారు.

jayashankar-on-terrorism-at-un-security-council-meet
'అంతర్జాతీయ సమాజం ఉగ్రవాదాన్ని సమర్థించకూడదు'
author img

By

Published : Jan 13, 2021, 6:29 AM IST

ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ వైఖరికి తావు ఉండకూడదని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. ఐక్యరాజ్య భద్రతా మండలి (యూఎన్ఎస్​సీ) ఏర్పాటు చేసిన వర్చువల్ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 1993 ముంబయి పేలుళ్లకు ఘటనకు కారకులైన వారికి భద్రత కల్పించడమే కాక సకల సదుపాయాలు కల్పిస్తున్నారని పరోక్షంగా పాకిస్థాన్​పై మండిపడ్డారు. ఉగ్రవాదం వల్ల అంతర్జాతీయ శాంతిభద్రతలకు ఏర్పడే ముప్పుపై యూఎన్​ఎస్​సీ మంగళవారం ఈ కార్యక్రమం నిర్వహించింది.

యూఎన్​ఎస్​సీకి ప్రత్యేక కార్యచరణను జైశంకర్ ప్రతిపాదించారు. తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు సంస్కరణలు అవసరమన్నారు. ఉగ్రవాదానికి మద్దతుగా జరిపే ఆర్థిక లావాదేవీలను గుర్తించడంలో ఉన్న లోపాలపై ఫైనాన్షియల్ యాక్షన్​ టాస్క్ ఫోర్స్ దృష్టి సారించాలన్నారు. కేవలం మత, రాజకీయ అంశాలను దృష్టిలో పెట్టుకుని చర్యలు చేపట్టకూడదన్నారు.

ఇదీ చదవండి : రైతుల ట్రాక్టర్ల ర్యాలీపై సుప్రీంకు కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.