ETV Bharat / international

ప్రేమ కోసం రూ.10కోట్లు వదులుకున్న రాకుమారి! - జపాన్​ రాకుమారి ప్రేమలో విలన్​

ఓ రాకుమారి తన సహాధ్యాయిని ప్రేమించింది. అయితే.. ఆర్థిక వివాదాలు వారిద్దరి మధ్యలో విలన్ పాత్ర పోషించాయి. ఎట్టకేలకు మూడేళ్ల నిరీక్షణ తర్వాత వారి పెళ్లికి రాజకుటుంబం అంగీకరించింది. కానీ, రాజకుటుంబ మహిళలు సామాన్యులను పెళ్లాడితే రాచరికాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. తన ప్రేమకోసం ఆ రాచరికాన్ని, తద్వారా వచ్చే రూ. 10కోట్లను కూడా వదులుకునేందుకు సిద్ధపడింది ఆ రాకుమారి.

Japanese Princess marriage news
జపాన్ రాకుమారి మకో వివాహం
author img

By

Published : Oct 2, 2021, 11:52 AM IST

రాకుమారి ప్రేమ కోసం తోటరాముడు ఎన్ని కష్టాలు పడ్డాడో 'పాతాళభైరవి' సినిమాలో చూశాం. జపాన్‌ రాజకుటుంబ కథలో ఈ కష్టాలు తారుమారయ్యాయి. తోటరాముడు న్యాయవాద విద్య అభ్యసించేందుకు తుర్రుమని న్యూయార్క్‌ వెళ్లిపోయాడు. రాణివాసాన రామచిలకలా మిగిలిపోయిన రాకుమారి మూడేళ్ల నిరీక్షణ తర్వాత కూడా తన ప్రేమను నిలబెట్టుకొని కథను పెళ్లిపీటల దాకా తీసుకొచ్చింది. ఈ కథలో నేపాళ మాంత్రికుడు లేకపోయినా ఆర్థిక వివాదాలు విలన్‌ పాత్ర పోషించి వారి ప్రేమను పరీక్షించాయి. మధ్యలో తీవ్ర మానసిక ఒత్తిడి వంటి రుగ్మతలు వేధించినా.. కాలపరీక్షలో నెగ్గిన జపాన్‌ రాకుమారి మకో (30)(Princess Mako) తన ప్రియుడు కీ కొమురో (29)ను అక్టోబరు 26న పెళ్లాడనుంది.

Japanese Princess marriage news
రాకుమారి మకో, కీ కొమురో

జపాన్‌ చక్రవర్తి నరుహిటో మేనకోడలైన మకోకు టోక్యో ఇంటర్నేషనల్‌ క్రిస్టియన్‌ యూనివర్శిటీలో కొమురో సహాధ్యాయి. 2017లోనే ఈ జంట తాము ప్రేమపెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. మరుసటి ఏడాది.. కొమురో తల్లి కారణంగా తలెత్తిన ఆర్థిక వివాదాలతో ఈ పెళ్లి అప్పట్లో రద్దయింది. దీంతో న్యూయార్క్‌ వెళ్లిపోయిన కొమురో 'లా' చదివి, వారం రోజుల కిందటే జపాన్‌కు తిరిగొచ్చాడు. ఈ మూడేళ్లలో ఒక్కసారి కూడా అతడు జపాన్‌ వైపు తిరిగి చూడలేదు.

వీరిద్దరి పెళ్లికి అంగీకరించిన రాజకుటుంబం గతంలోని ఆర్థిక వివాదాలతో ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉన్నందున.. వివాహానికి పెద్దగా హడావుడి చేయట్లేదని శుక్రవారం ప్రకటించింది. వివాహానంతరం ఈ జంట న్యూయార్క్‌ వెళ్లి అక్కడే స్థిరపడనుంది. జపాన్‌ రాజకుటుంబ మహిళలు సామాన్యులను పెళ్లాడితే రాచరికాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సిద్ధపడ్డ మకో రాజభరణం కింద తనకు వచ్చే రూ.10 కోట్ల (150 మిలియన్‌ యెన్‌లు) మొత్తాన్ని కూడా తిరస్కరించింది.

ఇదీ చూడండి: వందేళ్లకు తిరిగొచ్చిన రూ.556 కోట్ల ఆస్తి

ఇదీ చూడండి: మగ దోమలూ మనుషులను చుట్టుముడుతున్నాయ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.