ETV Bharat / international

భూకంపాల నుంచి రక్షించే సుప్రీం రైలు

author img

By

Published : Jul 8, 2020, 7:22 AM IST

సరికొత్త ఆవిష్కరణలకు పెట్టింది పేరైన జపాన్ ఇటీవల సరికొత్త రైలును పట్టాలకెక్కించింది. 360 కి.మీ గరిష్ఠ వేగంతో నడిచే ఈ రైలు భూకంపాలను పసిగడుతుంది. అందుకు అనుగుణంగా మార్పులు చేసుకుంటుంది. అత్యంత అధునాతనంగా తయారైన జపాన్ బుల్లెట్ రైలు విశేషాలను తెలుసుకోండి.

bullet train
భూకంపాల నుంచి రక్షించే సుప్రీం రైలు

ఇది సుప్రీం రైలు. పరుగులు పెట్టేటప్పుడు భూకంపాలు వచ్చినా పసిగట్టేస్తుంది. ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి చేరుస్తుంది. నవ్యావిష్కరణలకు చిరునామా అయిన జపాన్‌ ఈ సరికొత్త బుల్లెట్‌ రైలును ఇటీవల పట్టాలపైకి ఎక్కించింది. టొకైడో మార్గంలో తాజాగా దూసుకెళ్లిన ఈ రైలులో చాలా ప్రత్యేకతలున్నాయి.

రైలు మోడల్‌ పేరు

గతంలో ఎన్‌700, ఎన్‌700ఎ మోడళ్ల బుల్లెట్‌ రైళ్లున్నాయి. తాజాగా ప్రవేశపెట్టిన ఎన్‌700ఎస్‌ లో ఎస్‌ అంటే సుప్రీం.

japan
మోడళ్లు ఇవే..

గడువు లోగానే

సమయపాలనకు పెట్టింది పేరైన జపాన్‌ ఈ రైలు విషయంలోనూ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. ఈ ఏడాది జపాన్‌లో ఒలింపిక్స్‌ నిర్వహించాల్సి ఉండగా అదే సమయంలో ఈ రైలును పరుగులుపెట్టించాలనుకుని లక్ష్యంగా విధించుకుని సిద్ధం చేసింది. అయితే కరోనా కారణంగా ఒలింపిక్స్‌ 2021కు వాయిదా పడింది. రైలు మాత్రం వాయిదా పడలేదు.

వేగం: గరిష్ఠ వేగం గంటకు 360 కిలోమీటర్లు.

వాస్తవ వేగం గంటకు 285 కిలోమీటర్లు.

భద్రత

ఈ రైలులో అత్యంత ముఖ్యమైన ప్రత్యేకత భద్రతే. షింకన్‌సేన్‌ నెట్‌వర్క్‌ మొత్తాన్ని ఇప్పటికే భూకంపాన్ని గుర్తించే సెన్సార్లకు అనుసంధానించారు. ఎక్కడైనా భూకంపం వస్తే ఈ మార్గంలోని రైళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయి అత్యవసర బ్రేకులు వాటంతటవే పడి రైళ్లు ఆగిపోతాయి. ఎన్‌700ఎస్‌లో మరో ప్రత్యేక భద్రతా ఏర్పాటును జోడించారు. లిథియం-అయాన్‌ బ్యాటరీతో కూడిన స్వీయ-ప్రొపల్షన్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే ఈ తరహా ఏర్పాటు మొదటిది. భూకంపాలు వంటివి సంభవించి విద్యుత్‌ సరఫరా ఆగిపోయి వంతెన లేదా సొరంగం వంటి చోట్ల ఇరుక్కుపోతే దగ్గర్లోని సురక్షిత ప్రాంతానికి రైలు వెళ్లడానికి ఈ వ్యవస్థ ఉపకరిస్తుంది. మరింత అధునాతన స్వయంచాలిత నియంత్రణ-బ్రేకింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేయడంతో అత్యవసర పరిస్థితుల్లో చాలా వేగంగా రైలు ఆగిపోతుంది.

సీట్లు

japan
సీట్లు ఇలా..

మరింత వాలుగా కూర్చొనే ఏర్పాటు. ప్రతి సీటుకూ ఛార్జింగ్‌ సౌకర్యం.

లగేజి తీసుకోండి

దిగాల్సిన స్టేషన్‌ వచ్చినప్పుడు తమ వస్తువులు తీసుకోకుండా మర్చిపోవడం చాలా మందికి అనుభవమే. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. సీట్లవరుసకు పైభాగంలో లగేజి పెట్టుకునే చోట ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి స్టాప్‌లోనూ ఈ అరలకు అమర్చిన లైట్లు వెలుగుతాయి. దీంతో ప్రయాణికులకు లగేజి తీసుకోవాలని గుర్తుంటుంది.

కుదుపుల్లేని ప్రయాణం

మరింత అధునాతన సస్పెన్షన్‌ వ్యవస్థతో కుదుపులు లేని విధంగా తీర్చిదిద్దారు.

ఇదీ జపాన్‌ బుల్లెట్‌ రైళ్ల చరిత్ర

1964లో టోక్యోలో ఒలింపిక్స్‌ నిర్వహించారు. అదే సంవత్సరం తొలిసారిగా జపాన్‌ షింకన్‌సేన్‌ను ఏర్పాటు చేసింది. షింకన్‌సేన్‌ అంటే జపనీస్‌ భాషలో కొత్త రైలు మార్గం అని అర్థం. జపాన్‌ బుల్లెట్‌ రైళ్లకు ఆ వ్యవస్థే నాంది. ఆ ఏడాది టోక్యో, షిన్‌-ఒసాకాను కలిపే టొకైడో మార్గాన్ని ఏర్పాటు చేసి తొలి వేగవంతమైన రైలు నడిపారు.రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచానికి తనను తాను రుజువు చేసుకోవడానికి స్వయంగా అభివృద్ధి చేసుకున్న రైల్వే సాంకేతికత జపాన్‌కు ఒక మార్గం చూపింది. హిటాచీ తదితర కంపెనీలు అధునాతన రైలు వ్యవస్థలను ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు విక్రయించడం ద్వారా జపాన్‌కు భారీగా విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించిపెడుతున్నాయి. 1889లో టోక్యో నుంచి ఒసాకాకు రైలులో పట్టిన సమయం పదహారున్నర గంటలు కాగా 1965లో ఆ సమయం మూడు గంటల పది నిమిషాలకు తగ్గిపోయింది.

ఎన్ని మార్గాలు

japan
ఈ మార్గాల్లోనే

షింకన్‌సేన్‌ వ్యవస్థలో ప్రధానంగా 9 మార్గాలున్నాయి. ఈ 9 మార్గాలూ దాదాపుగా జపాన్‌ మొత్తాన్ని చుట్టివస్తాయి. అందులో టొకైడో మార్గం ఒకటి. భూకంపసమయంలోనూ ప్రయాణికులను సురక్షితంగా ఉంచే సరికొత్త బుల్లెట్‌ రైలును తాజాగా ప్రవేశపెట్టింది ఈ మార్గంలోనే.

ఇదీ చూడండి: మహమ్మారిపై 'ధారావి' పోరు- కొత్తగా ఒకే ఒక్క కేసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.