japan earthquake: జపాన్ను భూకంపం వణికించింది. ఈశాన్య జపాన్లోని ఫుకుషిమాలో భూకంపం బుధవారం రాత్రి సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.3గా నమోదైంది. ఈ భూకంపం వల్ల నలుగురు ప్రాణాలు కోల్పోగా, 97 మంది గాయాలపాలయ్యారు. భూకంప ప్రభావంతో జపాన్ రాజధాని టోక్యో సహా పలు నగరాల్లోని ఇళ్లు ధ్వంసమయ్యాయి. దాదాపు 20 లక్షలకు పైగా ఇళ్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భూకంపం సంభవించిన వెంటనే అధికారులు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు.
జపాన్లో 11ఏళ్ల క్రితం రిక్టర్ స్కేలుపై 9 తీవ్రతతో భారీ భూకంపం వచ్చి సునామీకి కారణమైన ప్రాంతంలోనే ఈసారి భూమి కంపించింది. ఇప్పుడు 7.3 తీవ్రతతో భూకంపం సంభవించవించడం వల్ల దేశ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
"భూకంపం కారణంగా నలుగురు మరణించారు. మరో 97 మంది గాయపడ్డారు. వారి మరణానికి గల కారణాలను తెలుసుకుంటాం. ప్రభుత్వం భూకంపం వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేస్తోంది"
-ఫుమియో కిషిడా , జపాన్ ప్రధానమంత్రి
ఇదీ చదవండి: మరో క్షిపణిని ప్రయోగించిన నార్త్ కొరియా.. అయితే ఈసారి..!