జపాన్ టోక్యోలో శీతా కాలంలో దొరికే మంచు పీతలకు డిమాండ్ చాలా ఎక్కువ. సముద్రంలో లభించే వీటిని ఎంతో రుచికరంగా తింటారు స్థానికులు. జాలర్లు ఈ పీతలను వేలంపాట ద్వారా విక్రయిస్తారు. పశ్చిమ జపాన్లోని టొట్టోరి ప్రాంతంలో ఓ మంచు పీతను వేలంపాట వేయగా.. స్థానిక రెస్టారెంట్ నిర్వహకుడు రూ. 32,62,067 చెల్లించి దీనిని కొనుగోలు చేశాడు.
ప్రపంచంలోనే ఇది అత్యంత ఖరీదైన పీతగా రికార్డులకెక్కనుంది. ప్రపంచ గిన్నిస్ రికార్డుల్లోనూ చోటు సంపాదించుకున్నే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇది 1.2 కేజీల బరువు, 14.6 సెంటీమీటర్ల పొడవు ఉంది.
ఇదీ చూడండి : అసోంలో 'ఏనుగుల' పంట పండిస్తున్న దంపతులు