ETV Bharat / international

భూమికి చేరుకున్న గ్రహశకల నమూనాలు - గ్రహశకలానికి సంబంధించిన నమూనాలు

సుదూర గ్రహశకల నమూనాలను సేకరించాలన్న జపాన్​ కల నెరవేరింది. తమ​ వ్యోమనౌక హయబూసా-2 జారవడిచిన క్యాప్సూల్ విజయవంతంగా భూమిని చేరుకుంది. ముందుగా నిర్దేశించిన ప్రకారం ఆస్ట్రేలియాలో ఇది ల్యాండ్​ అయింది.

Japan capsule carrying asteroid samples lands in Australia
భూమికి చేరుకున్న గ్రహశకల నమూనాలు
author img

By

Published : Dec 6, 2020, 6:58 AM IST

సుదూర గ్రహశకలానికి సంబంధించిన నమూనాల భూమికి చేరుకున్నాయి. వీటిని తీసుకొట్టిన జపాన్​ వ్యోమనౌక హయబుసా­­-2 జారవిడిచిన క్యాప్సూల్​​.. ఆస్ట్రేలియాలోని వూమెరాలో.. పెద్దగా జనవాసాలు లేని ప్రాంతంలో ఆదివారం ఉదయం ల్యాండ్​ అయింది. ఈ మేరకు తమకు సంకేతాలు అందినట్లు జపాన్​ శాస్త్రవేత్తలు తెలిపారు. వీటిపై పరిశోధించడం ద్వారా సౌర కుటుంబం, భూమి పుట్టుక గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చని చెబుతున్నారు.

పారాచూట్​ సాయంతో..

భూమికి 2.2 లక్షల కిలోమీటర్ల ఎత్తులో ఉండగా..క్యాప్సూల్​ను హయబుసా-2 విడిచిపెట్టింది. భూవాతావరణంలోకి ప్రవేశించిన సమయంలో అగ్నిగోళంగా మారింది. నేల నుంచి 10 కిలోమీటర్ల ఎత్తులో పారాచూట్​ విచ్చుకొని, వేగం తగ్గింది. అనంతరం సాఫీగా ఆస్ట్రేలియా గడ్డపై దిగింది. ఈ క్యాప్సూల్​ను నిర్దిష్టంగా గుర్తించడానికి ఆ ప్రాంతంలో అనేక శాటిలైట్​ యాంటెన్నాలు, రాడార్లను, జపాన్​ ఏర్పాటు చేసింది. ఈ క్యాప్సూల్​ వెడల్పు 40 సెంటీమీటర్లే. ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల జపాన్​ శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.

ఏడాది కిందట..

భూమికి 30 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న రియూగు అనే గ్రహశకలం నుంచి ఏడాది కిందట ఈ నమూనాలను హయబుసా-2 సేకరించింది. తాజాగా క్యాప్సూల్​ను జారవిడిచిన హయబుసా-2.. 1998కేవై26 అనే గ్రహశకలం దిశగా పయనాన్ని ఆరంభించింది. అక్కడికి చేరుకోవడానికి పదేళ్లు పడుతుంది. ఉల్కలు భూమిని ఢీకొట్టే విదానాలపై పరిశోధన సాగిస్తుంది. ఇటీవలే అమెరికా అంతరిక్ష సంస్థ(నాసా)కు చెందిన 'ఒసైరిక్​ రెక్స్​' వ్యోమనౌక బెన్ను అనే గ్రహశకలం నుంచి నమూనాలను సేకరించింది.

ఇదీ చూడండి:భూగ్రహానికి మరో ముప్పు.. 2068లోనే అంతమా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.