ETV Bharat / international

మోదీ పర్యటనలో హింసకు కుట్ర- జమాత్ నేత అరెస్ట్​ - షాజహాన్​ అరెస్ట్​

జమాత్​ ఈ ఇస్లామి గ్రూప్ సీనియర్​ నేత షాజహాన్​ చౌధరిని బంగ్లాదేశ్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. గత మార్చిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్​ పర్యటన సందర్భంగా చిట్టగాంగ్​లో అల్లర్లకు ప్రేరేపించారన్న ఆరోపణల నేపథ్యలంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు .

Jamat senior leader arrested
బంగ్లాదేశ్​లో జమాత్ సీనియర్​ నేత అరెస్ట్​
author img

By

Published : May 17, 2021, 6:38 AM IST

Updated : May 17, 2021, 7:03 AM IST

బంగ్లాదేశ్​లో జమాత్​ ఈ ఇస్లామి గ్రూప్ సీనియర్​ నేత షాజహాన్​ చౌధరిని అక్కడి పోలీసులు అరెస్ట్​ చేశారు. గత మార్చిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్​ పర్యటన సందర్భంగా చిట్టగాంగ్​లో అల్లర్లకు ప్రేరేపించారన్న అభియోగాలపై శనివారం ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్​కు తరలించారు.

చౌధరి గత ప్రభుత్వ హయంలో ఎంపీగా ఎన్నికయ్యారు. అలానే గత ప్రభుత్వ కూటమిలో జమాత్​ కీలక భాగస్వామిగా వ్యవహరించింది. గత మార్చి 26, 27 తేదీల్లో నరేంద్ర మోదీ బంగ్లాదేశ్​ పర్యటన సందర్భంగా.. నిరసనలు తెలుపుతూ హెఫాజత్​ వర్గం అల్లర్లకు పాల్పడింది. ఈ ఘటనల్లో నలుగురు చనిపోగా.. పలువురు గాయపడ్డారు. విధ్వంసం సృష్టికి హెఫాజత్​ వర్గంతో కలిసి షాజహాన్ కుట్రపన్నారని పోలీసులు ఆదివారం వెల్లడించారు.

ఇదీ చూడండి: గాజాపై మరోమారు ఇజ్రాయెల్​ రాకెట్ల వర్షం!

Last Updated : May 17, 2021, 7:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.