ETV Bharat / international

చైనా కమ్యూనిస్ట్​ పార్టీలోకి జాకీ చాన్​! - చైనా అధికార పార్టీలోకి జాకీ చాన్​

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్​ చైనా(సీపీసీ)లో తనకు చేరాలని ఉందని చెప్పారు హాలీవుడ్​ స్టార్​ కథానాయకుడు జాకీ చాన్​. సీపీసీ వందేళ్లలోపు చేస్తానని చెప్పిన హామీలను కొన్ని దశాబ్దాల్లోనే నెరవేర్చగలదని ఆయన అన్నారు.

Jackie Chan in cpc
సీపీసీలోకి జాకీ చాన్​
author img

By

Published : Jul 12, 2021, 7:45 PM IST

హాంకాంగ్​కు చెందిన హాలీవుడ్​ స్టార్​ కథానాయకుడు జాకీ చాన్​.. తాను చైనా అధికార పార్టీ అయిన కమ్యూనిస్ట్​ పార్టీ ఆఫ్​ చైనా(సీపీసీ)లో చేరాలనకుంటున్నట్లు చెప్పారు. బీజింగ్​లో గురువారం నిర్వహించిన ఓ చర్చా కార్యాక్రమంలో జాకీ చాన్​ ఈ మేరకు వెల్లడించారు.

జులై 1న సీపీసీ వందేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు జిన్​పింగ్ చేసిన కీలక​ ప్రసంగంపై చైనా సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. చైనా ఫిల్మ్ అసోసియేషన్​ ఉపాధ్యక్షుడిగా ఉన్న జాకీ చాన్​ ఈ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ పార్టీలో చేరికపై తన ఆసక్తిని బయటపెట్టారు.

"సీపీసీ గొప్పతనాన్ని నేను చూడగలను. సీపీసీ వందేళ్లలోపు ఏదైతే చేస్తానని హామీ ఇచ్చిందో దాన్ని కొన్ని దశబ్దాల్లోనే నెరవేర్చగలదు. సీపీసీలో నేను సభ్యుడిని అవ్వాలనుకుంటున్నాను."

-జాకీ చాన్, హాలీవుడ్​ కథానాయకుడు

కొన్నేళ్లుగా సీపీసీకి జాకీ చాన్​ మద్దతిస్తున్నారు. సీపీసీకి చెందిన చైనీస్​ పీపుల్స్​ పొలిటికల్​ కన్సల్టేటివ్​ కాన్ఫరెన్సులో(సీపీసీసీ) ఆయన చాలాకాలంపాటు సభ్యుడిగా పనిచేశారు. అయితే.. 2019లో హాంకాంగ్​లో ప్రజాస్వామ్య అనుకూల నిరసనను వ్యతిరేకించి జాకీ చాన్​ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. "హాంకాంగ్​, చైనా నా జన్మస్థలాలు, నా ఇళ్లు. చైనా నా దేశం. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. అలాగే నా ఇంటిని కూడా. హాంకాంగ్​ త్వరలోనే శాంతి తిరిగి నెలకొంటుందని ఆశిస్తున్నాను" అని 2019లో జాకీ చాన్​ చెప్పారు.

ఇదీ చూడండి: ప్రజాస్వామ్యంపై చైనా దెబ్బ- హాంకాంగ్​​పై మరింత పట్టు

ఇదీ చూడండి: హాంకాంగ్​పై పూర్తి నియంత్రణకు చైనా కుయుక్తులు

ఇదీ చూడండి: చైనాపై సీపీసీ ఉక్కు పిడికిలి బిగించిందిలా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.