ETV Bharat / international

ఇటలీపై కరోనా పంజా.. అంత్యక్రియలకూ నోచుకోని మృతదేహాలు - italy corona latest news

కరోనా కారణంగా ఇటలీలో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. వందల మంది ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. శ్మశాన వాటికలో శవాలను ఉంచేందుకు ఖాళీ లేదంటే.. అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సునామీలా వచ్చిన కరోనా మహమ్మారి దెబ్బకు ఇటలీలో నెలకొన్న విషాద గాథలపై కథనం.

italy-corona-deaths-worst-situation
ఇటలీలో చావుకేక.. అంత్యక్రియలకూ నోచుకోని మృతదేహాలు
author img

By

Published : Mar 23, 2020, 7:25 AM IST

అది ఇటలీ ఉత్తర ప్రాంతంలోని లోంబార్డీ ప్రావిన్సులో ఉన్న బెర్గామో పట్టణం. ఇక్కడ విటోరియా(79) అనే వ్యక్తి కరోనా మహమ్మారి బారినపడి కన్నుమూశాడు. కూతురు లూకా డి పాల్మా తండ్రి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం శ్మశాన వాటికకు తీసుకెళ్లింది. అప్పటికే అక్కడ అంత్యక్రియల కోసం అనేక మృతదేహాలు క్యూలో ఉన్నాయి. విటోరియా మృతదేహాన్ని ఉంచడానికి అక్కడ స్థలం లేదు. అధికారులు అతని భౌతిక కాయాన్ని ఇంటికి తిప్పిపంపారు. దీంతోపాటు ఓ శవపేటిక, కొన్ని కొవ్వొత్తులు, ఓ శిలువ, మృతదేహాన్ని భద్రపరిచే రిఫ్రిజిరేటర్‌ను లూకాకు ఇచ్చి పంపారు. కొన్ని రోజులు ఇంట్లోనే భద్రపరచాలని సూచించారు.

రెంజో(85) కరోనా వైరస్‌కు బలయ్యారు. ఆయన మృతదేహాన్ని బెర్గామోలోని చర్చి వద్ద రోజుల తరబడి అంత్యక్రియల కోసం వదిలేయాల్సిన పరిస్థితి.. ఇతని భార్యకూ వైరస్‌ సోకింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. వీరితో కలిసి తిరిగిన కూతురు మార్తా తీస్తా(43) ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నారు. తీస్తాకు ఆమె పిల్లలు బయటి నుంచే ఆహారం అందించి వెళుతున్నారు. రెంజోకు నివాళి అర్పించేవారు లేరు.

చిగురుటాకులా వణుకుతున్న పట్టణం

ఇటలీలోని బెర్గామో పట్టణం ఇప్పుడు చిగురుటాకులా వణికిపోతోంది. సునామీలా వచ్చి పడిన మహమ్మారి దెబ్బకు వందల మంది ఇక్కడ పిట్టల్లా రాలిపోయారు. ఈ ఉత్పాతాన్ని 11 లక్షల మంది నివసించే ఈ సుసంపన్న పట్టణం కలలో కూడా ఊహించి ఎరుగదు. ఒక్కసారిగా మృతదేహాల సంఖ్య పెరగడంతో వాటికి అంత్యక్రియలు నిర్వహించలేక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రెండు ఆసుపత్రుల వద్ద, ఒక శ్మశానవాటిక వద్ద, మరో చర్చి సమీపంలో మృతదేహాల్ని భద్రపరిచే గదులు నిండిపోయి, ఇంకా వస్తున్న వాటిని లోపలికి తీసుకునే పరిస్థితి లేక, వాటిని క్యూలైన్లలో ఉంచుతున్నారు. లేదా ఇళ్లకు తిప్పిపంపి, కొద్దిరోజులు అక్కడే భద్రపరచాలని సూచిస్తున్నారు. కరోనా ఆనవాళ్లు వెలుగుచూసిన కొత్తలోనే ఇటలీలో తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

కరోనా అనుమానితుల సమాచారం అందుకున్న వెంటనే అంబులెన్సులు సైరన్లు మోగించుకుంటూ వెళ్లి.. ఆ వ్యక్తుల్ని ఆసుపత్రికి తరలిస్తున్నాయి. అక్కడ అదుపులోకి రాని కేసులు చివరికి కవర్లు కప్పి ఉంచిన మృతదేహాల రూపంలో బయటికి వస్తున్నాయి. బెర్గామో ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసి ఉన్నాయి. ఇక కొత్త రోగుల్ని తీసుకునే పరిస్థితి లేదని డాక్టర్లు వాపోతున్నారు. సైనిక డాక్టర్లు 24 గంటలూ సేవలు అందిస్తున్నారు. ఇలా చికిత్స అందిస్తున్న 10 మంది డాక్టర్లకూ వైరస్‌ సోకింది. మృతదేహాల్ని తీసుకువెళ్లే అంబులెన్సులు, గుర్రపు బండ్ల చప్పుళ్లు మాత్రమే బెర్గామోలో రాత్రివేళల్లో వినపిస్తున్నాయి.

పత్రికల నిండా స్మృత్యంజలులే!

పత్రికల్లో స్మృత్యంజలి ప్రకటనలు విపరీతంగా పెరిగిపోయాయి. కేవలం రెండు పేజీల స్మృత్యంజలి ప్రకటనలు ప్రచురించే పత్రికలు సైతం ప్రస్తుతం 10 పేజీల దాకా.. దాదాపు 150 మంది పేర్లను ప్రచురిస్తున్నాయి. ‘ఎల్‌ఎకోడీ బెర్గామో’ అనే పత్రికలో అయితే ఎటుచూసిన స్మృత్యంజలి ప్రకటనలే.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.