ETV Bharat / international

'ఫ్లొరోనా' పేరుతో కొత్త వ్యాధి- ఆ దేశంలో తొలి కేసు నమోదు - ఇజ్రాయెల్​ కొవిడ్ కేసులు

Israel Florona disease: ఇజ్రాయెల్​లో ఫ్లొరోనా వ్యాధి కలకలం రేపుతోంది. ఆ దేశంలో తొలి కేసు వెలుగు చూసింది.

Israel Florona disease
ఇజ్రాయెల్​లో ఫ్లొరోనా
author img

By

Published : Dec 31, 2021, 7:20 PM IST

Updated : Dec 31, 2021, 7:38 PM IST

Israel Florona disease: కరోనా ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న వేళ... ఇజ్రాయెల్​లో ఫ్లొరోనా వ్యాధి కలకలం రేపుతోంది. ఆ దేశంలో తొలి ఫ్లొరోనా కేసు వెలుగు చూసింది. ఈ విషయాన్ని అరబ్ న్యూస్ వార్తా సంస్థ ట్విట్టర్ వేదికగా గురువారం​ వెల్లడించింది.

ఫ్లొరోనా అంటే...?

ఫ్లొరోనా అంటే కొవిడ్-19, ఇన్​ఫ్లూయెంజా డబుల్ ఇన్​ఫెక్షన్ అని అర్థం. ఇజ్రాయెల్​లో ఈ తరహా కేసు వెలుగు చూడగా.. ఆ దేశ ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యాధి వ్యాప్తి కట్టడికి చర్యలు చేపట్టింది.

మరోవైపు.. ఇజ్రాయెల్​లో కరోనా టీకా నాలుగో డోసును అందించే ప్రక్రియ ప్రారంభించారు.

Israel vaccination: 'ఒమిక్రాన్' వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో.. కొవిడ్​ టీకా డోసుల ద్వారా అందిన రోగ నిరోధక శక్తి క్షీణించినందున నాలుగో డోసు వేసే ప్రక్రియను తాము ప్రారంభించామని ఇజ్రాయెల్​ ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ నాచ్​మన్ యాష్ పేర్కొన్నారు. తమ దేశప్రజలకు మూడో డోసు టీకా అందించి నాలుగు నెలలు దాటిందని తెలిపారు.

ఇజ్రాయెల్​లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఆ దేశ ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం కొత్తగా దాదాపు 5,000 కేసులు నమోదయ్యాయి.

ఇదీ చూడండి: అమెరికాలో 'కొవిడ్​' ఉప్పెన.. ఒక్కరోజులో 5.6లక్షల కేసులు

ఇదీ చూడండి: ప్రపంచంపై మరోసారి కరోనా పంజా- వారంలోనే 11% పెరిగిన కేసులు

Last Updated : Dec 31, 2021, 7:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.