ETV Bharat / international

ఇరాక్​ ప్రధానమంత్రిపై హత్యాయత్నం

author img

By

Published : Nov 7, 2021, 6:49 AM IST

Updated : Nov 7, 2021, 9:33 AM IST

ఇరాక్​ ప్రధానమంత్రి(Iraq Pm News) ముస్తాఫా అల్​-కధామీపై హత్యాయత్నం జరిగింది. డ్రోన్​లతో ఆయన నివాసంపై దాడి చేసి, విఫలమయ్యారు దుండగులు. దీంతో ప్రధానికి ప్రాణహాని తప్పింది.

Iraq's PM assassination attempt
ఇరాక్​ ప్రధానమంత్రి

ఇరాక్​ ప్రధానమంత్రి(Iraq Pm News) ముస్తాఫా అల్​-కధామీపై ఆదివారం హత్యాయత్నం జరిగింది. అదృష్టవశాత్తు ఆయనకు ప్రాణహాని తప్పింది. దుండగులు ఆయన(Iraq Pm News) ఇంటిపై డ్రోన్​ దాడులకు యత్నించి విఫలమయ్యారు.

బాగ్దాద్‌లోని ముస్తాఫా(Iraq Pm News) నివాసంపై పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్​ దాడికి దుండగులు విఫలయత్నం చేశారని ఇరాక్​ సైన్యం తెలిపింది. అయితే.. ఆయనకు ఎలాంటి హాని జరగలేదని, క్షేమంగా ఉన్నారని వెల్లడించింది. ఈ దాడులకు పాల్పడినవారిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పింది.

drone attack on iraq pm
ఇరాక్​ ప్రధాని నివాసంపై డ్రోన్​ దాడి
drone attack on iraq pm
ప్రధాని నివాసంపై డ్రోన్​ దాడి దృశ్యాలు
drone attack on iraq pm
ధ్వంసమైన తలుపులు
drone attack on iraq pm
డ్రోన్​ దాడి దృశ్యాలు

మరోవైపు.. ప్రధాని ముస్తాఫా కూడా ట్విట్టర్​ వేదికగా తాను సురక్షితంగా ఉన్నానని చెప్పారు. ప్రజలు ఎవరూ ఆందోళనకు గురికావద్దని పేర్కొన్నారు.

"రాకెట్​ దాడులతో ప్రజల నమ్మకాన్ని ఎవరూ వమ్ము చేయలేరు. ప్రజల భద్రత కోసం, న్యాయాన్ని సాధించడానికి, చట్టాన్ని అమలు చేయడానికి కృషి చేస్తున్న మన వీరోచిత భద్రతా దళాల దృఢత్వం, పట్టుదల ఏమాత్రం తగ్గదు. నేను బాగున్నాను. ప్రజలంతా సంయమనంతో ఉండాలని కోరుతున్నాను.

-ముస్తాఫా అల్​-కధామీ, ఇరాక్ ప్రధాని.

ఈ దాడులకు బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే... బాగ్దాద్​లో​ ప్రధాని నివాసం ఉన్న గ్రీన్​జోన్​ ప్రాంతంలో పెద్దఎత్తున కాల్పుల శబ్దం వినిపించిందని ఓ అంతర్జాతీయ మీడియా తన కథనంలో తెలిపింది.

ఇదీ చూడండి: హైస్పీడ్​ రైలులో కత్తితో దాడి

Last Updated : Nov 7, 2021, 9:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.