ఇరాన్ సైన్యాధిపతి సులేమానీ అంతిమయాత్రలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 50కిపైగా పెరిగింది.
అంతిమ యాత్రలో తొక్కిసలాట- 50కి చేరిన మృతులు - అంతిమ యాత్రలో తొక్కిసలాట- 35 మంది మృతి
Mourners walked through the streets of Karman ahead of the burial, carrying the Iranian flag and the images of the general to pay respect to slain general. The outpouring of grief is an unprecedented honour for a man viewed by Iranians as a national hero.

20:03 January 07
50 మందికి పైగా మృతి
15:44 January 07
అమెరికాపై ప్రతీకారానికి ఇరాన్ అధ్యక్షుడి 'ప్రతిజ్ఞ'
ఇరాన్ సైన్యాధిపతి జనరల్ ఖాసీం సులేమానీ అంతిమయాత్రలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడినట్లు ఇరాన్ అధికారిక టీవీ తెలిపింది. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. సులేమానీ జన్మస్థలమైన కెర్మెన్లో ఆయన అంతిమయాత్ర జరుగుతుండగా ఈ అపశ్రుతి చోటుచేసుకున్నట్లు ఇరాన్ అత్యవసర వైద్య సేవల అధిపతి పిరోస్సీన్ కౌలివాండ్ ధ్రువీకరించారు. ప్రమాదానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.
ప్రతీకారానికి అధ్యక్షుడి 'ప్రతిజ్ఞ'
రివల్యూషనరీ గార్డ్ జనరల్‌కు కడసారి వీడ్కోలు పలికేందుకు లక్షలాది మంది ప్రజలు భాగమయ్యారు. కెర్మెన్లోని ప్రధాన రహదారులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు సైతం సులేమానీ మద్దతుదారులతో కిక్కిరిసిపోయాయి. తమ ఆరాధ్యనేత హత్యకు బదులుగా అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవాలని నినాదాలు చేస్తూ సాగారు ఇరాన్ ప్రజలు. అదే సమయంలో ఖాసీం అంతిమయాత్రలో పాల్గొన్న లక్షలాది మంది ప్రజల సాక్షిగా యూఎస్‌పై తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని ఆదేశాధ్యక్షుడు ప్రతిజ్ఞ పూనారు.
ఈ నెల 3న హత్య
ఇరాక్‌లోని అమెరికా బలగాలను సులేమానీ చంపారని, అలాగే మరికొన్ని దాడులకు ప్రణాళికలు రచిస్తున్నారనే నెపంతో గత శుక్రవారమే సులేమానీని హత్య చేసింది అమెరికా. ఇరాన్ ప్రజలు హీరోగా భావించే ఖాసీంతో పాటు ఇరాక్ మిలిటరీ కమాండర్ అబు అల్ ముహందిస్ను బాగ్దాద్ విమానాశ్రయంలో డ్రోన్ దాడితో మట్టికరిపించింది.
15:14 January 07
అంతిమ యాత్రలో తొక్కిసలాట- 35 మంది మృతి
అమెరికా దాడిలో మరణించిన ఇరాన్ సైన్యాధిపతి ఖాసీం సులేమానీ అంతిమయాత్రలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 35 మంది మరణించారు. 48 మంది గాయపడ్డారు.