ఇరాన్ తన యురేనియం శుద్ధి సామర్థ్యాన్ని 60 శాతానికి పెంచే ప్రక్రియను శుక్రవారం ప్రారంభించినట్లు ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగర్ ఖలీబాఫ్ తెలిపారు. ఇటీవల తమ అణుకర్మాగారంపై దాడి జరిగిన నేపథ్యంలో ఈ ప్రక్రియను మొదలుపెట్టినట్లు పేర్కొన్నారు. అయితే ఎంత మొత్తంలో ఈ యురేనియం శుద్ధి చేస్తుందో ఆయన వెల్లడించలేదు. ఈ మేరకు 'స్టేట్ టీవీ' కథనం వెలువరించింది.
నతాంజ్లోని ఇరాన్ అణు కర్మాగారంలో ఇటీవల అనూహ్యంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థ కుప్పకూలి, అంధకారం నెలకొంది. ఇది తమ దేశ సైబర్ దాడి అని ఇజ్రాయెల్ పేర్కొన్న నేపథ్యంలో ఇరాన్ తన యురేనియం శుద్ధి సామర్థ్యాన్ని 60 శాతానికి పెంచుతామని ప్రకటించింది.
ఇరాన్ అణు కార్యక్రమాన్ని పరిమితం చేసేందుకు అగ్రరాజ్యాలతో కుదిరిన కీలక ఒప్పందాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు అమెరికా సహా పలు దేశాలు ప్రయత్నాలు చేశాయి. తాజా పరిణామాల నేపథ్యంలో వాటికి విఘాతం కలిగే అవకాశం కనిపిస్తోంది.
ఇదీ చూడండి:ఇరాన్ 'అణు' దూకుడు.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు!
ఇదీ చూడండి: ఇరాన్ అణు కర్మాగారంపై సైబర్ దాడి!