ఇరాన్ గగనతలంలోకి అక్రమంగా ప్రవేశించిన అమెరికా నిఘా డ్రోన్‌ను కూల్చివేసినట్లు ఇరాన్ సైన్యం 'రివల్యూషనరీ గార్డ్స్' ప్రకటించింది.
అమెరికాకు చెందిన 'గ్లోబల్ హవాక్' నిఘా డ్రోన్‌ను తమ దేశ వైమానిక దళం కూల్చేసిందని పేర్కొంది ఇరాన్. ఈ ఘటన దక్షిణ తీర రాష్ట్రంలోని హార్మోజ్గన్లో జరిగిందని ఇరాన్ ప్రభుత్వ స్టేట్ టెలివిజన్ తెలిపింది. డ్రోన్ ఛాయా చిత్రాలు, వీడియో వంటి ఆధారాలను బయటపెట్టలేదు.
అదేమీ లేదు..
అమెరికా నిఘా డ్రోన్‌ను కూల్చామన్న ఇరాన్ ప్రకటనను యూఎస్ సైనికదళం ఖండించింది.
అమెరికా, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం గమనార్హం.
మధ్యప్రాచ్యంలో చమురు ట్యాంకర్లపై జరిగిన దాడుల వెనుక ఇరాన్ ఉందని అమెరికా ఆరోపిస్తోంది. అందువల్ల దాడులకు ఆ దేశమే బాధ్యత వహించాలని అంటోంది. ఈ ఆరోపణలను ఇరాన్ ఖండిస్తోంది.
ఇదీ చూడండి: ఉత్తరకొరియా పర్యటనలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్