ETV Bharat / international

శత్రు దేశాలకు ఇరాన్​ పరోక్ష హెచ్చరిక!

author img

By

Published : Apr 14, 2021, 1:16 PM IST

యురేనియం శుద్ధి సామర్థ్యాన్ని 60 శాతానికి పెంచడం.. విధ్వంసానికి తాము ఇచ్చే సమాధానం అని ఇరాన్ అధ్యక్షుడు హసన్​ రౌహాని పేర్కొన్నారు. ప్రస్తుతం తమ చేతులు నిండుగా ఉన్నాయని శత్రుదేశాలకు పరోక్షంగా హెచ్చరికలు చేశారు.

iran president hassan rouhani
హసన్​ రౌహాని, ఇరాన్​ అధ్యక్షుడు

యురేనియం శుద్ధి సామర్థ్యాన్ని 60 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని.. విధ్వంసాలకు, దుశ్యర్చలకు తాము ఇచ్చే సమధానం అని ఇరాన్​ అధ్యక్షుడు హసన్​ రౌహాని అభివర్ణించారు. బుధవారం జరిగిన కేబినెట్​ సమావేశంలో ఆయన శత్రు దేశాలకు పరోక్షంగా హెచ్చరికలు చేశారు.

"మీరు చర్చలు జరుగుతున్నప్పుడు మా చేతుల్ని ఖాళీ చేయాలని ప్రయత్నించారు. కానీ, మా చేతులు నిండుగా ఉన్నాయి. యురేనియం సామర్థ్యాన్ని 60 శాతానికి పెంచడం.. మీ దుశ్చర్యలకు మేము ఇచ్చే సమాధానం. ఐఆర్​-6 సెంట్రిఫ్యూజు, యురేనియం శుద్ధి సామర్థ్యాన్ని 60 శాతానికి పెంచడం ద్వారా మీ చేతుల్ని మేం తొలగించగలం."

-హసన్​ రౌహాని, ఇరాన్​ అధ్యక్షుడు

ఇరాన్‌ తన అణు కార్యక్రమానికి మరింత పదును పెట్టింది. అత్యాధునిక న్యూక్లియర్‌ సెంట్రిఫ్యూజ్‌ ఐఆర్‌-9 పరీక్షలు గత శనివారం ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇరాన్‌ తొలిసారి వాడిన ఐఆర్‌-1 తో పోలిస్తే ఈ సెంట్రిఫ్యూజ్‌ 50 రెట్లు వేగంతో పనిచేస్తుంది. ఈ క్రమంలోనే నతాంజ్​లోని అణుకర్మాగారంపై సైబర్​ దాడి జరిగింది.

సైబర్​ దాడి జరిగిన కొద్ది రోజుల్లోనే ఇరాన్​ అధ్యక్షుడు రౌహాని ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చూడండి: అణు కర్మాగారంపై దాడి ఇజ్రాయెల్ పనే: ఇరాన్

ఇదీ చూడండి: ఇరాన్ అణు కర్మాగారంపై సైబర్ దాడి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.