ఇండోనేషియాలో కూలిపోయిన విమానంలోని ప్రయాణికుల మృతదేహాలు, శకలాల గాలింపు ప్రక్రియ కొనసాగుతోంది. గాలింపు బృందాలు జావా సముద్రంలో విమాన ఇంజిన్‌ను గుర్తించాయి. విమాన శకలాలు 75 అడుగుల లోతుకు చేరినట్లు గుర్తించారు. ప్రమాద కారణాలు కనుక్కోవడంలో కీలకమైన రెండు బ్లాక్ బాక్స్‌లను సైతం కనుక్కొన్నారు. సిగ్నళ్ల ఆధారంగా వాటిని త్వరలోనే బయటకు తీస్తామని ఇండోనేషియా ఆధికారులు తెలిపారు. శనివారం జకార్తా నుంచి పోంటియానాకు బయలుదేరిన విమానం గాల్లోకి ఎగిరిన నాలుగు నిమిషాల్లోనే కూలిపోయింది.
శ్రీవిజయ ఎయిర్ కు చెందిన ఈ విమానంలో ఏడుగురు చిన్నారులు, ముగ్గురు శిశువులు, సిబ్బందితో సహా మొత్తం 62 మంది ఉన్నారు.
ఇదీ చదవండి : జావా సముద్రంలో ఇండోనేసియా విమాన శకలాలు గుర్తింపు