ఆశ, నమ్మకం... ఓ ప్రవాస భారతీయుడ్ని వరుసగా పదేళ్లపాటు లాటరీ టికెట్లు కొనేలా చేశాయి. ఎట్టకేలకు కుబేరుడిగా మార్చాయి.
దుబాయ్‌లో ఓ దుకాణంలో పనిచేసే శ్రీజిత్... గత పదేళ్లుగా లాటరీ టికెట్లు కొంటున్నాడు. కానీ... ప్రతిసారీ నిరాశే ఎదురైంది. ఈసారి మాత్రం అనూహ్యంగా జాక్‌పాట్ కొట్టాడు శ్రీజిత్. ఇన్ఫినిటీ క్యూఎక్స్ 50 అనే లగ్జరీ కారు, 2 లక్షల దిర్హామ్‌లు(రూ.38 లక్షల 42వేలు) గెలుచుకున్నాడు. 25వ దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్లో భాగంగా రాఫల్ పేరుతో ఏర్పాటుచేసిన మెగా ఈవెంట్లో ఈ అదృష్టాన్ని సొంతం చేసుకున్నాడు శ్రీజిత్.
"నేను నమ్మలేకపోతున్నా. గత పదేళ్లుగా రాఫల్ లాటరీ టికెట్లు కొంటున్నాను. ఏదో ఒక రోజు అదృష్టం తగులుతుందనుకున్నాను. ఇది నాకు చాలా ఎక్కువ. కలలు నిజమయ్యాయి. నాకు ఇద్దరు పిల్లలు, ఇంకొకరు రాబోతున్నారు. ఈ మొత్తాన్ని నా పిల్లల భవిష్యత్తుకు వినియోగిస్తా."
-శ్రీజిత్, లాటరీ విజేత
దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్లో ఏర్పాటు చేసిన రాఫల్ లాటరీలో ఒక్కో టికెట్ విలువ 200 వందల దిర్హామ్స్.