ETV Bharat / international

భారత సైన్యమే దాడికి పాల్పడింది : చైనా - Three Indian soldiers killed at LOC

గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణపై స్పందించింది చైనా విదేశాంగ శాఖ. ఏకపక్ష చర్యలకు దిగి సమస్యను మరింత జటిలం చేయకూడదని పేర్కొంది. భారత సైనికుల మరణంపై ఆరా తీసింది. పూర్తి ఘటనకు భారత్​నే తప్పుబట్టే ప్రయత్నం చేసింది.

Indian troops on Monday seriously violated consensus of the two sides by illegally crossing the border twice : China Foreign Minister
భారత సైన్యమే దాడికి పాల్పడింది : చైనా
author img

By

Published : Jun 16, 2020, 2:23 PM IST

తూర్పు లద్దాఖ్​​​లోని గాల్వన్ లోయలో చెలరేగిన వివాదంపై భారత్​​నే తప్పుబట్టే ప్రయత్నం చేసింది చైనా. భారత సైన్యమే వాస్తవాధీన రేఖను దాటి తమ భూభాగంలోకి ప్రవేశించిందని.. చైనా అధికారులపై దాడికి పాల్పడిందని బుకాయించింది. ఇదే అంశంపై స్పందించిన ఆ దేశ విదేశాంగ శాఖ కూడా తమ తప్పును కప్పి పుచ్చుకోవాలని చూసింది. ఏకపక్ష చర్యలకు దిగి సమస్యను మరింత జటిలం చేయకూడదని పేర్కొంది. చైనాతో చెలరేగిన వివాదంలో తమ సిబ్బంది మరణించారన్న దానిపైనా భారత సైన్యాన్ని ఆరా తీసినట్లు తెలిపింది.

" ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని భారత సైన్యమే ఉల్లంఘించింది. సోమవారం భారత సైనికులు రెండుసార్లు సరిహద్దు దాటి చైనా సైన్యంపై దాడికి పాల్పడ్డారు. అది కాస్తా తీవ్ర ప్రత్యక్ష ఘర్షణకు దారితీసింది. సరిహద్దు వద్ద గస్తీ కాస్తున్న భారత సైనికులు వాస్తవాధీన రేఖను దాటి చైనా భూభాగంలోకి ప్రవేశించకుండా చూసుకోవాలి. ఏకపక్ష ధోరణి నిర్ణయాల వల్ల సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితులు మరింత జటిలమవుతాయి."

- చైనా విదేశాంగ శాఖ

సరిహద్దు సమస్యకు చెక్​ పెట్టేందుకు గతవారం భారత్​- చైనా మధ్య కుదిరిన అంగీకారం మేరకు సైన్యాన్ని వెనక్కి తీసుకునే ప్రక్రియలో సోమవారం రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో ఓ కమాండింగ్‌ అధికారి సహా మొత్తం ముగ్గురు భారత సైనికులు వీర మరణం పొందారు. ప్రస్తుత ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరుదేశాల సీనియర్‌ సైనికాధికారులు సమావేశమయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.